తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
మండలి ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరణ నేటితో ముగించ నున్నామని, పరిశీలనకు సంబంధించి ఈ నెల 16 లోపు పూర్తిచేస్తామని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు వివరించారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి నుండి అన్నిజిల్లాల డి ఆర్ ఓ లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా తిరుపతి కలెక్టరేట్ నుండి డి ఆర్ ఓ పాల్గొన్నారు. డి ఆర్ ఓ వివరిస్తూ నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగిందని, పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు, ఆక్జలరీ (అనుబంద) పోలింగ్ కేంద్రాల జాబితా సిద్దమైందని రేపు చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు ఆర్.ఓ. వారికి సమర్పించనున్నామని తెలిపారు. పట్టబద్రుల , ఉపాద్యాయ ఓటర్లకు సంబందించి 639 పరిశీలన చేయాల్సి వుందని, సి ఇ ఓ నిర్దేశించిన మేరకు ఈ నెల 16 నాటికి పూర్తిచేస్తామని వివరించారు. ఈ నెల 14, 15 న సి.ఇ.ఓ. వారు వీడియో కాన్ఫెరెన్స్ ద్వార ఇవ్వనున్న మాస్టర్ ట్రైనర్ ల శిక్షణ పూర్తి అయిన వెంటనే జిల్లాలో ఇ ఆర్ ఓ లకు , పి ఓ ల , ఒపిఒ ల శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో ఎ.ఒ. సుబ్రమణ్యం , ఎన్నికల తహసిల్దార్ పరమేశ్వర స్వామి , సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News