శివనాధ పాలెం సమీపంలో హౌంసిగ్ కు కేటాయించి భూమిని పరిశీలించిన కలెక్టర్

తొట్టంబేడు, శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
శివనాధ పాలెం సమీపంలో హౌంసిగ్ కు కేటాయించి భూమిని పరిశీలించి చదును కొరకు చర్యలు చేపట్టలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం శ్రీకాళహస్తి డివిజన్లోని తొట్టంబేడు మండలం నెల్లిమాను కండ్రిగ గ్రామపంచాయతీ పరిధిలోని 13.56 ఎకరాలలో పది పంచాయతీలకు చెందిన లబ్ధిదారులకు గృహ నిర్మాణం కొరకు భూమి చదునుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించుటకు జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి శ్రీకాళహస్తి ఆర్డిఓ రామారావు మరియు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. లేఔట్ లో భూమిని చదును చేసేందుకు అయ్యే నిధులు, సాధ్యా సాధ్యాలను అంచనాల కొరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *