Breaking News

పదవ తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయండి..

-చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి.
-నూరు శాతం ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులను సత్కరిస్తాం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదవ తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయాలని,చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రధానోపాధ్యాయులను కోరారు.
జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో స్థానిక సిద్దార్థ ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియంలో సోమవారం జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయలు మండల విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 3వ తేది నుండి 18వ తేది వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించిందరన్నారు. జిల్లా వ్యాప్తంగా 30,134 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు.
విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు ఉన్న 15 రోజులు వ్యవది ఎంతో కీలకమైనదన్నారు. ఉపాధ్యాయులు ఆత్మ పరిశీలనతో మనస్సాక్షిగా విద్యార్థులపై దృష్టి పెట్టి పరీక్షలకు సన్నద్దం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని తద్వారా ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యార్థుల తల్లిదండ్రులలో గౌరవం పొంది పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చిన వారవుతారన్నారు. విద్యార్థి సమాజంలో ఉత్తమ పౌరుడిగా ఎదగాలంటే తల్లిదండ్రుల కంటే అధిక ప్రాధాన్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది పదవ తరగతి పరీక్షలే అన్నారు. పదవ తరగతి పరీక్ష పాస్‌ అయితే ఉన్నత చదువులు చదివేందుకు దోహదపడుతుందని లేదంటే ఆ విద్యార్థి జీవితమే చదువు లేని వాడిగా మిగిలిపోతుందని ఈ విషయాన్ని గుర్తించి ఉపాధ్యాయులు విద్యార్థి పదవ తరగతి పాస్‌ అయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ దశలో సబ్జెక్టు ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి అర్థమయ్యే రీతిలో బోదించి పరీక్షలను ఎదుర్కొనేందుకు సన్నద్దం చేయాలన్నారు. పరీక్ష లకు హాజరయ్యే పద్దతి, ప్రశ్నకు సంబంధించి జవాబు వ్రాసే విధానం వంటి విషయాలను విద్యార్థులకు సూచించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒత్తిడిని తట్టుకుని పరీక్షలను ప్రశాంతంగా వ్రాసేవిధంగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. గత పరీక్షల మాధిరిగా కాకుండా ఈ ఏడాది కేవలం ఆరు పేపర్లను మాత్రమే విద్యార్థులు వ్రాయవలసి ఉంటుందన్నారు. పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నుండి మూడు రోజులు వ్యవది ఉన్నందున వ్రాయవలసిన ఆ సబ్జెక్టు పై విద్యార్థులకు విశధీకరించేలా ప్రత్యేక దృష్టి పెడితే మంచి ఫలితాలను సాధించగలుగుతారన్నారు. నూరు శాతం ఫలితాలను సాధించేందుకు ఇప్పటి నుండే ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. పరీక్షల ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఇంటి వద్ద చదువుకుని పరీక్షలకు హాజరు అవుతారనే ఉద్దేశాన్ని విడనాడి పాఠశాలలోనే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఇప్పటి నుంచి ఉపాధ్యాయులు పరీక్షలు పూర్తి అయ్యేవరకు ఏ ఒక్క రోజు పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో పాటు మిగిలిన తరగతుల విద్యార్థులపై కూడా ఆదే శ్రద్ద కనపరచాలన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కిశోరాబాలికలలో రక్త హీనతను నివారించేందుకు సరఫరా చేస్తున్న ఐరన్‌ ట్యాబ్‌లెట్లను తప్పనిసరిగా వినియోగించేలా పర్యవేక్షించాలని కలెక్టర్‌ డిల్లీరావు కోరారు
సమావేశంలో డిఇవో సివి రేణుక, స్కూల్‌ ఇన్‌స్పెక్టర్‌ కొండ. రవికుమార్‌, డిప్యూటి డిఇవో గౌరిశంకర్‌, గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ అసిస్టెంట్‌ కమీషనర్‌ కె.వి.ఎన్‌. కుమార్‌, డిసిఇబి సెక్రటరీ ఉమర్‌ అలీ, జిల్లాకు చెందిన మండల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *