-ఇంటర్ పరీక్ష కేంద్రం, సచివాలయం, ఫ్యామిలీ ఫిజిషియన్ సందర్శన
తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా ఏర్పాటు చేసిన తరువాత తూర్పు గోదావరి జిల్లాలో 47 కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.
శుక్రవారం తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామంలో జూనియర్ కాలేజి ఆవరణలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో మార్చి 15 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సౌకర్యవతంగా ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 37,288 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రలలో త్రాగునీరు, మెడికల్ క్యాంపు నిర్వహించడం తో పాటు సి సి కెమెరా లు ద్వారా పర్యవేక్షణ చేపట్టడం జరుగుతోందని అన్నారు.
2) ప్రక్కిలంక సచివాలయం ఆకస్మిక తనిఖీ :
గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా మరింత సమర్థవంతంగా పౌర సేవలు అందించాలని కలెక్టర్ కె. మాధవీలత స్పష్టం చేశారు. ప్రతి సచివాలయం లో లబ్దిపొందిన లబ్దిదారుల వివరాలు సామాజిక తనిఖీ నేపథ్యంలో ప్రదర్శించాలని పేర్కొన్నారు. సచివాలయం పరిధిలో పథకాల వారీగా లబ్దిదారుల వివరాలు ప్రజలకు తెలియ చేసేలా నోటీస్ బోర్డు లో ఏర్పాటు చేయాలన్నారు. వివిధ పథకాల ద్వారా లబ్ది పొందిన జాబితాను కలెక్టర్ పరిశీలించారు. హౌసింగ్ నిర్మాణాలు జరుగుతున్న లే అవుట్ ల వద్ద అవసరమైన మేరకు బోర్ వెల్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలియచేశారు. ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన ఇసుకను లే అవుట్ వద్ద అందించడం జరుగుతుందన్నారు.
3) ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
ప్రక్కిలంక గ్రామంలో శుక్రవారం నిర్వహిస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వైద్య సేవలు పొందుతున్న ప్రజలతో ముఖాముఖి మాట్లాడడం జరిగింది. అందుతున్న వైద్య సేవలు, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ తదితర వివరాలు తెలుసుకున్నారు. గ్రామ స్థాయి లో ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కింద ఏ ఎన్ ఎం, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్స్ యొక్క పాత్రను అడిగి తెలుసుకున్నారు. ముందుగా గ్రామ సచివాలయం యొక్క డేటా ఆధారంగా వైద్య సేవలు అందించి, వైద్యం పొందిన, మందులు తదితర వివరాలు డేటా ఎంట్రీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, బిపి, షుగర్ పేషంట్స్ తో వైద్య సేవకు వివరాలు మందుల పంపిణీ చేయడం పై వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఉచితంగా మందులు ఇవ్వడం తో పాటు అవసరమైన వైద్య పరీక్షలు చేస్తున్నట్లు ప్రజలు కలెక్టర్ కు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 18 మండలాలు పరిధిలో ప్రతి రోజూ ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కింద గ్రామాల్లో వైద్య సేవలు అందించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాలకు ముందస్తు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ వెంట కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లి బాబు, డిప్యూటీ డి ఎమ్ హెచ్ వో డా ఎన్. వసుంధర, మండల స్థాయి అధికారులు
Prajavartha Online Telugu News