“జాబ్ మేళ”

-వేదిక మండల ప్రజపరిషత్ కార్యాలయం, రాజానగరం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనైపుణ్యాభివృద్ధిసంస్థ, జిల్లా ఉపాది కార్యాలయం మరియు సీడాప్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తూర్పుగోదావరిజిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు గాను చేపడుతున్న “జాబ్ మేళ” నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి కె. హరీష్ చంద్రప్రసాద్,జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎమ్ కొండల రావు, జేడిఎం కేశవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా, ఈనెల 20వ తేదీన ఉదయం 9.00 గంటలకు రాజనగరం మండలం రాజానగరంలో స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద గల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు “మినీ జాబ్ మేళ” నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలైన వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ డైరీ ఎక్విప్మెంట్ అండ్ ఫ్యాబ్రికేటర్స్ కంపెనీలు హాజరు కానున్నాయన్నారు. ఈ కంపెనీల్లో వివిధ ఉద్యోగాలలో పనిచేయుటకు బి. టెక్ మెకానికల్, ఏదైనా డిగ్రీ, పాలిటెక్నిక్,ఐ.టి.ఐ, మరియు ఇంటర్,పదవ తరగతి,పూర్తి చేసి 19 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులన్నారు. ఎంపికైయిన వారికి రూ.10,000 నుంచి రూ.20,000 వరకు విద్యార్హత మరియు అనుభవంను బట్టి మంచి వేతనం ఇస్తారని, ఆ రోజున నిర్వహించే “మినీ జాబ్ మేళ”కు హాజరు అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు నేరుగా ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆశక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా Shorturl.at/fAFSW తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి లేదా నేరుగా వేదిక వద్ద సంప్రదిoచగలరు సదరు “మినీ జాబ్ మేళ” కు రెజ్యూమెలతో పాటు ఆధార్, పాన్ మరియు ఇతర సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో, సిద్దపడి ది.20-03-2023 సోమవరం నాడు ఉదయం 9:00 గంటలకు తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం మండలం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద గల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్దకు రావాలని మరిన్ని వివరాలకు “8919868419”,“9581810049″ నంబర్లను సంప్రదించాలని వారు ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *