విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఆదివారం అజిత్ సింగ్ నగర్, కృష్ణా హోటల్ సెంటర్ నందు ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ అధ్వర్యంలో ఎన్.ఎస్.యు.ఐ. 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇంఛార్జి వలిబోయిన గురునాధం విచ్చేసి ఎన్.ఎస్.యు.ఐ. వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారభించారు.
తదననంతరం ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ఎన్.ఎస్.యు.ఐ. జెండా ఆవిష్కరణ చేసి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్ వలిబోయిన గురునాధం తో కలిసి 53వ వ్యవస్థాపక ఆవిర్భావ దినోత్సవ కేక్ ను కటింగ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏపీసిసి లీగల్ చైర్మన్ వలిబోయిన గురునాథం మాట్లాడుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి విద్యార్థులు తమ సమస్యలను తామంతట తామే పరిష్కరించే విధంగా విద్యార్థి శక్తి ఎదగాలని ఎన్.ఎస్.యు.ఐ. ని శ్రీమతి శ్రీ ఇందిరా గాంధీ గారు ఏప్రిల్ 9, 1971వ తేదీన స్థాపించడం జరిగిందని అన్నారు.
ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశ దిశ దశ మార్చగలిగింది కేవలం ఒక విద్యార్థి శక్తినే అని, విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ప్రస్తుతం విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉన్నారని తద్వారా వారసత్వం రాజకీయాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని శాసిస్తున్నాయని, కేవలం విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి వలనే దేశ భవిష్యత్తు మారుతుందని, కావున విద్యార్థి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు షేక్ ఖాజా మొహిద్దిన్, సిటీ ఎస్సీ సెల్ చైర్మన్ రాచార్ల సూర్య ప్రకాష్, 58వ డివిజన్ అద్యక్షులు షేక్ మాబూ వలి, ఎన్.ఎస్.యు.ఐ. విజయవాడ నగర అధ్యక్షులు బత్తుల అంకమ్మ రాజు, ఉపాధ్యక్షులు రాయవరాపు రాజు, ప్రధాన కార్యదర్శి ఉప్పు జస్వంత్, ధీరజ్ కుమార్, సి.హెచ్. భాను ప్రకాష్ చేతుల మీదుగా స్థానికులకు మజ్జిగ ప్యాకెట్ ల పంపిణీ చేయడం జరిగింది.
Prajavartha Online Telugu News