ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ది అగ్రగామీగా నిలిపేందుకు కృషి చేస్తా

-జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని నూతనంగా భాధ్యతలు స్వీకరించిన జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌ అన్నారు. స్థానిక జాయింట్‌ కలెక్టర్‌ విడిది కార్యాలయంలో శనివారం ఎన్‌టిఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా డా. పి. సంపత్‌ కుమార్‌ పదవీబాధ్యతను స్వీకరించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన గృహ నిర్మాణం, భూముల రీసర్వే, పౌరసరఫరాలు, రెవెన్యూ సేవలను ప్రజలకు పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధిలో అగ్రగామీగా నిలిపేలా తన వంతు కృషి చేస్తాన్నానన్నారు. మండల స్థాయిలోని తహాశీల్థార్లు, ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌ కోరారు. పదవీ భాధ్యతలు సేకరించిన అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ డా. పి సంపత్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. జాయింట్‌ కలెక్టర్‌కు సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్‌, డిపివో జె.సునీత, జిల్లా సర్వే అధికారి కె. సూర్యారావు, డిఎస్‌వో కోమలిపద్మ కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ఇంతియాజ్‌ పాషా, తహాశీల్థార్లు సిహెచ్‌ దర్గాప్రసాద్‌, యం. మాదురి, వెంకట్రామయ్య, పలువురు రెవెన్యూ అధికారులు సిబ్బంది కలిసి శుభకాంక్షలు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *