Breaking News

మిల్లట్స్‌ న్యూట్రిషయన్‌ బుల్లెట్స్‌…

-భవిష్యత్‌ తరాలకు చిరుధాన్యాలే కీలకం..
-చిరుధాన్యాలను వినియోగించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూట్రిషయన్‌కు మిల్లట్స్‌ బుల్లెట్‌లాంటివని, భవిష్యత్‌ తరాలకు చిరుధాన్యాల వినియోగమే కీలకమని చిరుధాన్యాలను ఉపయోగించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు.
చిరుధాన్యాల వినియోగంపై గొల్లపూడిలోని టిటిడిసి భవనంలో శనివారం నిర్వహించిన మిల్లట్స్‌ మహోత్సవ్‌ 2023 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిదిగా హాజరయ్యారు. చిరుధాన్యాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం స్వయం సహాయక బృందాల మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో చిరుధాన్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. మన ముందు తరం వారు చిరుధాన్యాలను వినియోగంచడం వలన ఇప్పటికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ప్రస్తుత దైనందిన జీవితంలో జంక్‌ఫుడ్స్‌, రెడీ టూ ఈట్‌ వంటి ఆహార పదార్థాలను వినియోగించి ఆనారోగ్యా పాలవుతున్నారన్నారు. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయన్నారు. రానున్న కాలంలో చిరుధాన్యాల వినియోగమే కీలకంగా మారబోతుందన్నారు. రక్త హీనత, థైరాయిడ్‌, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు అరికట్టేందుకు చిరుధాన్యాల వినియోగం ఎంతో దోహదపడతాయన్నారు. మన పూర్వికులు రాగి జావ, రాగి సంకటి, రాగి ముద్ద, జొన్న అన్నంలను ఉపయోగించడం ద్వారా దీర్ఘకాలం ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపారన్నారు. చిరుధాన్యాలతో తయారయ్యే ఆహారం పేదవాడు తినే ఆహారం అనే అపోహ ఉందన్నారు. చిరుధాన్యాలతో తయారైన వంటకాలపై ప్రస్తుతం ఉన్నత వర్గాలవారు సైతం దృష్టి పెట్టడం చిరుధాన్యాల ఆవశ్యకతను గుర్తు చేస్తుందన్నారు. చిరుధాన్యాల పంటలను చేపట్టేందుకు రైతులలో అవగాహన కల్పించాలన్నారు. చిరుధాన్యాల పంటలను చేపట్టేందుకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయన్నారు. చిరుధాన్యాల సాగుకు అతి తక్కువ నీరు, ఎరువులు, పురుగుమందులు అవసరం అవుతాయని తక్కువ ఖర్చుతో అధిక దిగుబాడులు సాధించి మంచి లాభాలను సాధించవచ్చున్నారు. స్వయం సహాయ బృందాల మహిళలు చిరుధాన్యల పంటలను చేపట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. స్వయం సహాయక బృందాల మహిళలు చిరుధాన్యాల వినియోగంపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చిరుధాన్యాల వలన ప్రయోజనాలను గుర్తించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాగి జావను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రైతులు పండిరచే చిరుధాన్యాలకు మార్కెట్‌ సౌకర్యం కల్పించడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
అనంతరం స్వయం సహాయక బృందాల మహిళలు సైనిక సంక్షేమ నిధికి సేకరించిన 4 లక్షల 17 వేల రూపాయల చెక్‌ను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ద్వారా జిల్లా సంక్షేమ అధికారి డా. వీణాకు అందజేశారు.
కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్‌, ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, వ్యవసాయ శాఖ జెడి నాగమణమ్మ, జడ్పిఎన్‌ఎఫ్‌ జిల్లా పిడి విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ కుమార్‌, జిల్లా సైనిక సంక్షేమ అధికారి డా.వీణా జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు కె.సీత, స్వయం సహాయక బృందాల మండల అధ్యక్షులు, సిపిలు, ఎఫ్‌డివోలు, మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *