Breaking News

కార్యకర్తల తో ఆత్మీయ సమావేశం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం నాడు తూర్పు నియోజకవర్గం 21,22 డివిజన్ లో కార్యకర్తల సమావేశానికి తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అవినాష్ మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంత అంత కూడా వైస్సార్సీపీ పార్టీ కి భలం అన్ని ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా పార్టీకి ఎంతో ముఖ్యం అని వారికీ రానున్న కాలంలో పార్టీ వారికీ సముచిత స్థానం కలిపిస్తుంది అని అవినాష్ అన్నారు. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాలలో ఇప్పటి వరుకు ఈ పార్టీ చేయలేని వింధంగా అభిరుద్ది కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత మన వైస్సార్సీపీ పార్టీ అనే విషయాన్ని ప్రజలకు వివంచాల్సిన భాద్యత ప్రతి కార్యకర్తకు ఉంది అని అవినాష్ అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలను, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ను నాయకులకు, కార్యకర్తలకు వివరించారు. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తన పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ జనరంజకంగా పరిపాలన చేస్తున్న జగన్ కి మద్దతు గా కార్యకర్తలు నిలుస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర రాజకీయాలు తిప్పికొట్టాలని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ షో రాజకీయాలు చేస్తూ ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి అర్ధం అయేలాగా మనం చేసిన అభిరుద్దిని వారికి సాక్ష్యాలతో చూపించి ప్రతి పక్షాల కుట్రలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు సూచించారు.
మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని విజయ వంతం చేసిన క్లస్టర్ ఇన్ చార్గ్స్ కి, కన్వీనర్లకు, గృహ సారధులకు అభినందనలు తెలియజేసారు వీరికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అని అవినాష్ అన్నారు. రానున్న కాలంలో అందరూ కూడా భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాము ఎల్లపుడు ప్రతి కార్యకర్తలు కి పూర్తి అండగా ఉంటాం దేవినేని నెహ్రూ గారి ఇంటి తలపులు కార్యకర్తలు కోసం ఎప్పుడు తెరిసే ఉంటాయి అవినాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చి బాబు, 21 వ డివిజన్ కొర్పొరేటర్ పుప్పాల కుమారి, 22వ డివిజన్ కొర్పొరేటర్ తాడిపత్రి కొండా రెడ్డి, అధ్యాకులు టిపి రెడ్డి, జోగా రాజు, వైస్సార్సీపీ నాయకులు మీర్ హుస్సేన్, రామకృష్ణ, కసగని దుర్గ రావు, పెద్ద అబ్బాయి, పుప్పాల రాజ, గౌరీ, ప్రసాద్, సుబ్బారెడ్డి, పవన్, నాగి రెడ్డి, కనకదుర్గ, అసిఫ్, ఫాజిలుద్దిన్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *