విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ మారుతి నగర్ కొండ మీద నివసించే గునుపూడి ముసలయ్య కుమారుడు సాయి తేజ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారి దృష్టికి తీసుకురాగా సోమవారం వారిని పరామర్శించి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం 25,000/- రూపాయల ఆర్థిక సహాయం స్థానిక డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్,కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ మెంబెర్ ఏల్లబోయిన ప్రభు మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకుల చేతులు మీదగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంలో వియ్యపు అమర్నాధ్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ గారు ఎప్పుడు కూడా పేదలకు అండగా ఉండేవారని, కష్టం అంటూ ఎవరు ఇంటికి వచ్చిన కులమత పార్టీలకతీతంగా వారికి అండగా నిలిచి, సమస్య పరిష్కారానికి కృషి చేశారని,నేడు ఆయన తనయుడు దేవినేని అవినాష్ గారు కూడా అదేబాటలో నడుస్తూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, ఉపాధి కల్పన కోసం అనేక సేవ కార్యక్రమలు చేపట్టడం జరిగిందని వివరించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్,కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ మెంబెర్ ఏల్లబోయిన ప్రభు, బుడ్డి, ప్రకాష్, వెంకటేశ్వరరావు, రామారావు, డాలి, శ్రీను, నాని, రాంబాబు, శంకర్ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News