Breaking News

జీవవైవిధ్యాన్ని తిరిగి నిర్మిద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి “మానవాళి మనుగడకు జీవవైవిధ్య పరిరక్షణ అవసరం’ అని పిలుపు నిచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక ఎస్.వి.వెటర్నరీ ఆడిటోరియంలో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం- 2023 రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిధిగా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పాల్గొన్నారు.
రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి మాట్లాడుతూ జీవవైవిధ్య చట్టం- 2002 మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2006 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఏర్పాటు చేసి రాష్ట్ర, జిల్లా మండలి, పంచాయితీ స్థాయిలలో ప్రజా జీవవైవిధ్య రిజిస్టర్ (e-PBR)లను సిద్ధం చేసి , జీవవైవిధ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై వీడియోలను, ప్రచురణలు, పోస్టర్లు, నాలెడ్జ్ మెటీరియల్స్, పుస్తకాలు మొదలైన వాటి ద్వారా జీవవైవిధ్యంపై జీవవైవిధ్య యాజమాన్య కమిటీల ద్వార గ్రామ స్థాయి వరకు వ్యాప్తి చేసి అనుసరిస్తున్నామని అన్నారు. మనం తినే ఆహారంలో 97% మొక్కల నుండి. 3% జంతువుల నుండి కావున మనం మొక్కలు మరియు జంతువుల మన మనుగడ ప్రధానం అని అన్నారు. రాష్ట్రంలో ఇంటింటికి ఔషధ మొక్కల పంపిణీ 13 వేల స్వయం సహాయక సంఘాల ద్వారా 5,82,000, 11 నర్సరీలను అభివృద్ధి చేసి 6,60,000 ఔషధ మొక్కలను పెంచడం జరిగిందని, జీవవైవిధ్య పార్కులు, జీవవైవిధ్య మ్యూజియంలు, జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశాలు అభివృద్దిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు పోతున్నామని 1) రాష్ట్రంలో ఉన్న జీవవైవిధ్యాన్ని సంరక్షించుటకు చర్యలు తీసుకొనడం.. 2) జీవవైవిద్యాన్ని సుస్థిరమైన విధానాల్లో వినియోగించుటకు చర్యలు తీసుకొనడం, 3) జీవవనరులు వాణిజ్యపరంగా వినియోగము జరిగినప్పుడు, తద్వారా లభించు ప్రయోజనాన్ని హక్కుదారులకు సమానంగా పంపిణీ చేయడం జరుగుతున్నదని అన్నారు. ఇన్ని చేస్తున్నా కొంత మేరకే సాధించామని , కార్యాచరణ ప్రణాళికను మేరకు 2030 ఒప్పందంలో ఉన్న అన్ని చర్యలను మనం తప్పనిసరిగా అమలు చేయాలి అనే ఆలోచనను , 2050 నాటికి సురక్షితమైన, సుస్థిరమైన జీవవైవిధ్యాన్ని సాధించేందుకు సమిష్టి కృషి చేయాలని అన్నారు.
సమావేశం ప్రారంభానికి ముందు మంత్రి అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవం -2023 రాష్ట్ర స్థాయి కార్యక్రామం లో ఏర్పాటులో ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు 1. బయోడైవర్సిటీ బోర్డ్, విజయవాడ, 2. యోగి వేమన విశ్వవిద్యాలయం, 3. మత్స్య శాఖ, 4. నేషనల్ గ్రీన్ కార్పొరేషన్ , 5. ఫారెస్ట్ జూలాజికల్ పార్క్ సంయుక్తంగా స్టాల్ ఏర్పాటు, 6. జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 7. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, 8. వ్యవసాయ శాఖ, 9. పరంపర వైద్య మహా సంఘం పుత్తూరు వారి ఆయుర్వేద నిలయం, 10. డిఆర్డిఏ వారి చిరుధాన్యాల ప్రాధాన్యత, 11. విద్య విద్వాన్ బద్వేల్ ఆయుర్వేదం, పశుసంవర్థక శాఖ స్టాల్స్ సందర్శించి ఫారెస్ట్ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జీవవైవిధ్యాన్ని తిరిగి నిర్మిద్దాం అని మిషన్ లైఫ్ సేల్ఫీ తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప, బోర్డ్ చైర్మన్ బి.ఎం.కే.రెడ్డి, అడిషనల్ పి.సి.సి.ఎఫ్. కె. గోపీనాధ, టిటిడి బోర్డ్ మెంబర్ పోకల అశోక్ కుమార్, ప్రొఫెసర్ సర్జన్ రావు, రిజిస్టార్ రవి, జూ క్యురేటర్ సెల్వం, సి.ఎఫ్.ఓ. నాగేశ్వరావు, ఎ.సి.ఎఫ్. నాగభూషణం, బయోట్రిం డి.ఎఫ్.ఓ. యశోదాబాయి, డి.ఎఫ్.ఓ. సతీష్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల జీవ వైవిధ్య మండలి అన్ని స్థాయిల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *