-పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకే మిషన్ లైఫ్ ప్రోగ్రాం : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ హిత జీవన శైలికి అలవాటు పడాలని ప్రతి ఒక్కరు అనుసరించాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ నందు ” లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ” అనే అంశంపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం జరిగింది.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు కృషిచేసి ప్రజలను పర్యావరణ అనుకూల అలవాట్లును అలవరచుకునే దిశగా అవగాహన కల్పించాలని తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావం నుండి కాపాడుటకు ప్రపంచాన్ని చైతన్యపరచుటకు ఉద్దేశించినదే (మిషన్ లైఫ్ ) పర్యావరణ హిత జీవనశైలి ప్రోగ్రాం అని తెలిపారు. ప్రజలకు వారి యొక్క జీవన శైలిలో కొన్ని మార్పులను చేయడం ద్వారా (మిషన్ లైఫ్) పర్యావరణహిత జీవనశైలికి మేలు జరుగుతుందని అన్నారు. వనరులను విచక్షణ రహిత మరియు విధ్వంసకర వినియోగానికి బదులుగా విచక్షణ సంహిత మరియు ఉద్దేశపూర్వక వినియోగ దిశగా మార్పు వచ్చేలా అందరూ కృషి చేయాలని తెలిపారు. పర్యావరణ జీవన శైలిలో 7 థీమ్స్ లో శక్తివనరులను, నీటిని పొదుపుగా వాడటం, ఒకసారిగా వినియోగించే ప్లాస్టిక్ వద్దు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు తగ్గించడం, సుస్థిర ఆహార పద్దతుల అలవర్చుకోవడం, వ్యర్థాలను తగించాలని , అరోగ్యకరమైన జీవన శైలి లక్ష్యంగా నిర్దేశించి 75 అంశాలను చేర్చడం జరిగిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ మరియు సంరక్షించడం యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా అటవీ , వ్యవసాయ , పర్యావరణ, ఇండస్ట్రీస్ వంటి లైన్ డిపార్ట్మెంట్ అధికారులందరూ జిల్లాలోనే గుర్తించబడిన 7 థీమ్స్ లో భాగంగా 75 అంశాల కు సంబంధించిన యాక్టివిటీస్ నిర్వహించి రోజువారి ఫోటోలు, వీడియోలు ప్రపంచ పర్యావరణం దినం జూన్ 5 లోగా http://missionlife.moefcc.nic .in పోర్టర్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ లు నాయుడుపేట శ్రీనివాసులు, పుత్తూరు కే ఎల్ ఎన్ రెడ్డి, సూళ్లూరుపేట నరేంద్ర కుమార్, తిరుపతి అదనపు కమిషనర్ సునీత, జిల్లా ఫారెస్ట్ అధికారి సతీష్, ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ ఎస్ ఈ శంకర్ నారాయణ, ఐసిడిఎస్ పి డి జయలక్ష్మి, డ్వామా పి డి శ్రీనివాస ప్రసాద్, జిల్లా మైనింగ్ అధికారి ప్రకాష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, జిల్లా పరిశ్రమల శాఖల అధికారి ప్రతాప్ రెడ్డి , డిఆర్డిఏ పిడి జ్యోతి, డి పి ఓ రాజశేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్, జిల్లా సూక్ష్మ నీటి సేద్య అధికారి సతీష్ , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News