Breaking News

పంచాయతీ వ్యవస్థలో సంఘ మహిళలు భాగస్వాములు అవ్వండి…

-డిపిఓ రాజశేఖర్ రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మే నెల 22వ తేదీ తిరుపతి జిల్లా సమాఖ్య సమావేశము జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డీపీఓ రాజశేఖర్ రెడ్డి హాజరై శానిటేషన్ గురించి మాట్లాడారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శానిటేషన్ చాలా అవసరం.మొదట చెత్తను వేరుచేసి వాటి నుండి రకరకాల వాటికి వాడాలన్నారు.ఇలా చేయడం వల్ల చెత్త కుళ్ళితే వచ్చే వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు.అందుకే కరకంబడి సత్యవేడు నాయుడుపేటలోని మేనకూరు పాకాల లోని ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకొని చెత్తను వేరు చేసి సంపదను సృష్టించాలన్నారు. ఛత్తిస్ గడ్ రాష్ట్రము లోని అంబికాపూర్ లో చెత్తను వేరు చేసి రకరకాల వాటికి వాడుతున్నారు. ఇందులో సంఘ మహిళలు భాగస్వాములై నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. ఇలానే మనమందరము గ్రీన్అంబాసిడర్లు, వాచ్మెన్ తో కలిసి పనిచేసి ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. తర్వాత డి ఆర్ డి ఏ, పి డి జ్యోతి మాట్లాడుతూ శానిటేషన్ అనేది చాలా అవసరం. ప్రతి గ్రామంలో శానిటేషన్ కార్యక్రమం జరుగుతున్నది.ఇందులో భాగంగా తడి చెత్త పొడి చెత్తను ఇంటి దగ్గర వేరు చేస్తే పని శులభమవుతుంది. ఈ విషయమై సభ్యులకు చిన్న పిల్లల వరకు అవగాహన కల్పించాలి. డిపిఓ ద్వారా అందరు కూడా ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయాలని తెలిపారు. సంఘ సభ్యులు చెత్త వేరు చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సెర్ప్ కూడా సూచించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడి ప్రభావతి ఐబీడీపీయం మాధవి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *