ప్రకృతి వనరులను కాపాడి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వనరులను కాపాడి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పారెస్టు బీట్ అధికారిణి డి. ఆశారేఖ పేర్కొన్నారు. ప్రాంతీయ అటవీ పరిశోధనా సంస్థ ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రం అధికారి సిల్వికల్చరిస్ట్ షేక్ సలాం అధ్వర్యంలో బుధవారం స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ అంశం పై మొక్కలు నాటడం, నీటి పొదువు, కాలుష్య నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డి. ఆశారేఖ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షణకు అందరు కృషి చేయాలన్నారు. నీటిని వృదా చేయకుంటా ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించు కోవాలన్నారు. కాలుష్యరహిత సమాజం కొరకు మొక్కలు నాటి వారి సంరక్షణ మన అందరి బాధ్యత అన్నారు. పచ్చని చెట్లు వలన మనకు ప్రాణ వాయువు సంవృద్దిగా లభిస్తుందని పేర్కొన్నారు. మానవాళి మనుగడకు ప్రాణవాయువు ఎంతో అవసరమని అటువంటి ప్రాణవాయువును అందించే చెట్లను సంరక్షించాలి తప్ప నరక కూడదన్నారు. ఖాళీ ప్రదేశాల్లో, పార్కుల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం ఉట్టిపడేలా కృషి చేయాలని బీట్ ఆఫీసర్ ఆశా రేఖ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పర్యవరణ పరిరక్షణపై ర్యాలీకి హాజరైన వారితో ప్రతిజ్ఞచేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి జీ ఎల్ఎస్ దేవి, సబ్ కలెక్టర్ సిబ్బంది, ఫారెస్టు బీట్ అధికారులు, అర్చన తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *