-చేనేత కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత ప్రాధమిక రంగంలో కార్మికులుగా పనిచేస్తూ ఆరంగం అభివృద్దికి కృషి చేస్తున్న కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తొందని చేనేత ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి పేర్కొన్నారు. సోమవారం మినీ బైపాస్ రోడ్డులో గల చేనేత సహకార సంఘం భవనం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 29 మంది బాధిత కుటుంబాలకు చెందిన నామినీలకు ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ చేనేత రంగంలో పనిచేస్తూ మరణించిన చేనేత కార్మిక కుటుంబాలకు బీమాతో పాటు అదనంగా రు.12500/- చొప్పున జిల్లాకు చెందిన 29 మంది కుటుంబాలకు పరిహారం అందజేస్తున్నామన్నారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామన్నారు.
చెక్కులు అందుకున్న బాధిత కుటుంబాలు ..
సిహెచ్ బుల్లిరాజు, ఆర్. కోటమ్మ, జె. సావిత్రమ్మ, చెల్లా శివయ్య,ఎస్. రాచయ్య, ఎసీ వెంకటేశ్వర్లు, టి.కోటేశ్వరరావు, ఒగ్గు సత్యనారాయణ, టి. సత్యనారాయణ, యం.రంగనాయకమ్మ, నీలం నాగరత్నం, టి.బీ. వీరనాగయ్య, ఏబీ.కోటయ్య, వీ. వీరన్న,పి. వెంకటేశ్వరావు, ఎస్. చంద్రరావు,ఆర్.విశ్వనాథం, కె. రామలింగేశ్వరరావు, కే. కోటేశ్వరరావు, ఎస్. వెంకమ్మ, ఎస్. వెంకన్న, యం.వరలక్ష్మి, ఆర్కేబీ నాగన్న, వైసీ నారయ్య, యం.చిన లోవరాజు, జి. సత్యం, జి. నాగభూషణం, సిహెచ్. పోలార్నం, ఎ.అన్నవరం కుటుంబ సభ్యులకు చైర్మన్ చిరంజీవి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలోమాజీ ఆప్కో డైరెక్టరు డి. సత్యనారాయణ, యం.వీర్రాజు, ఆప్కో డీఎం కె. పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News