గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ పి జాషువా, ఎమ్మెల్సీ- ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలసీల రఘురాం, బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య నాని సోమవారం మల్లాయపాలెం టిడ్కో గృహాల వద్ద ముఖ్యమంత్రి కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించారు. తొలుత హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన గావించి, అనువైన స్థలం గుర్తించి, హెలిప్యాడ్ వద్ద చేయవలసిన ఏర్పాట్లు గురించి ముఖ్యమంత్రి భద్రతా విభాగం, జిల్లా పోలీస్, రెవిన్యూ, ఆర్ అండ్ బి సంబంధిత అధికారులతో చర్చించారు. హెలిపాడ్ చుట్టూ వెన్యూ చుట్టు మెష్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని, హెలిపాడ్ వద్ద విఐపిలు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. టిడ్ కో గృహా సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన వైయస్సార్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించుటకు రిమోట్/ మాన్యువల్ గా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. విగ్రహం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించుటకు అవసరమైన ఎత్తులో చిన్న వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు.హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రి దిగి టిడ్కో గృహ సముదాయo లోకి ప్రవేశించుటకు రోడ్డు ఏర్పాటు చేయాలని అన్నారు. సభాస్థలి వద్ద ప్రోక్లైన్తో చదును చేసే పనులు పరిశీలించారు సభాస్థలి వద్ద గృహ సముదాయాల నమూనా ఏర్పాటుతోపాటు గృహాల వివిధ నిర్మాణ దశల ప్రగతిని తెలిపే ఫోటో గ్యాలరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. విఐపి వాహనాల పార్కింగ్, ఇతర వాహనాల పార్కింగ్ ప్రదేశాలు గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమ షెడ్యూలు విడుదల కాగానే ఏ ఎస్ ఎల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యమంత్రి కార్యక్రమం భద్రత ఏర్పాట్లతోపాటు అన్ని ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించడం జరుగుతుందన్నారు. గుడివాడ ఆర్డీవో పద్మావతి, టిట్కో ప్రాజెక్ట్ అధికారి బి.చిన్నోడు, గుడివాడ మున్సిపల్ కమిషనర్ మురళీధర్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News