Breaking News

స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ కిషోర్ లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి పలు ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ అర్జీదారుల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులను పిలిపించి అర్జీల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా అధికార యంత్రాంగం స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:
బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ కు చెందిన చెన్నూరి నాగమణి తాము బ్రతుకు తెరువు కోసం గుడివాడలో నివసిస్తున్నామని, తన కుమారుడు నవీన్ కుమార్ ఏఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడని, గత రెండు సంవత్సరాలుగా జగనన్న దీవెన, వసతి దీవెన డబ్బులు తన బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదని, కానుమోలులో నివసిస్తున్న చందు కమలాకర్ అనే వ్యక్తి అకౌంట్లో ఆ డబ్బులు పడుతున్నాయని తెలుపుతూ అతని నుండి ఆ డబ్బులు తనకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు.
పెడన మండలం మచ్చిలిగుంట గ్రామం వాస్తవ్యులు జన్ను వెంకటేశ్వరమ్మ తాను వ్యవసాయ కూలీనని ఉపాధి హామీ కూలీ డబ్బులు తనకు ఇవ్వడం లేదని, ఆ డబ్బులు అడిగితే పనికిరావద్దని తెలుపుతున్నారని తనకు న్యాయం చేయాలని విజ్ఞాపన పత్రం అందజేశారు.
మచిలీపట్నం హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన పేరం నరసింహారావు తనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రుద్రవరం లో మంజూరైన బి 3 బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ జి 6 ప్లాట్లు ఇచ్చేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
చల్లపల్లి మండలం మాజేరు గ్రామానికి చెందిన యెన్నం అరుణకుమారి తనకు రీ సర్వే నెంబరు 805-1 లో 0.40 సెంట్ల వ్యవసాయ భూమి ఉందని, చల్లపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 22-8-2002 వ తేదీన డాక్యుమెంటేషన్ చేశామని ప్రతి సంవత్సరము ప్రభుత్వానికి నీటి తీరువ చెల్లిస్తున్నానని పట్టాదారు పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇవ్వడంలేదని ఆ పాస్ పుస్తకం తనకు అందించి న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ స్పందన అర్జీల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి పీఎస్ఆర్ ప్రసాద్, డ్వామా పిడి జివి సూర్యనారాయణ, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, డిపిఓ నాగేశ్వర్ నాయక్, డీఎస్ఓ పార్వతి, ముడా విసి రాజేశ్వరి, సిపిఓ వై శ్రీలత, డిఎంహెచ్వో డాక్టర్ గీతా బాయి, డిఈఓ తేహెరా సుల్తానా తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *