Breaking News

పర్యావరణాన్ని కాపాడేందుకు మడ చెట్ల సంరక్షణ, అభివృద్ధి,విస్తరణ మరింతగా వ్యాపింప చేయాలి !!

-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మడ అడవుల ప్రాముఖ్యత గుర్తించి సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడేందుకు మడ చెట్ల సంరక్షణ, అభివృద్ధి, విస్తరణ ద్వారా మరింత వ్యాపింప చేయడం అందరి బాధ్యతని కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు.
సోమవారం ఉదయం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీశాఖ పర్యావరణహిత జీవనశైలి ( లైఫ్ ) స్థానిక గిలకలదిండిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు
మడ అడవుల సంరక్షణ, అభివృద్ధి కొరకు, ఇతర జీవ వైవిద్య సంబంధిత కార్యక్రమాలు చేపట్టేందుకు ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ఎస్. శరవణన్, జిల్లా అటవీశాఖాధికారి కె. రాజశేఖరరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావులతో కలిసి తొలుత పర్యావరణ ప్రతిజ్ఞ ఈ కార్యక్రమానికి హాజరైన వారితో చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు మాట్లాడుతూ, ఉవ్వెత్తున ఎగసిపడే కడలి కెరటాలకు అడ్డునిలిచే మడ అడవులు మానవ మనుగడకు దోహదపడుతున్నాయన్నారు. మడ అడవులను ఈ సృష్టి ప్రారంభంలోనే భగవంతుడు రూపొందించారని సముద్రపు ఆటుపోట్లకు బలమైన కెరటాల ఉధృతిని తగ్గించి తీరానికి రక్షణ కవచంగా ఉంచేందుకు మడ అడవులు ఎంతగానో మానవాళికి ఉపయోగపడతాయన్నారు. కృష్ణాజిల్లాలో దాదాపు 400 హెక్టార్ల విస్తీర్ణంలో మడ చెట్లు వ్యాపించాయని అన్నారు. నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలల్లో మడ అడవులు పెరుగుతాయన్నారు. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా నిలిచి ఉంటాయని, మడ అడవులు అనేవి ఉష్ణ, సమశీతోష్ణ మండల తీరప్రాంతాల్లో ఉప్పు నీటిలో పెరిగే చెట్లు అని చిత్తడి నేలల్లో బలమైన పొదల సముదాయమైన ఈ మడ చెట్లు, పొదలు ఉప్పునీటి లోనూ, సము ద్రపు నీటి లోనూ, సముద్రపు నీటి కంటే ఎన్నోరెట్లు ఉప్పగా ఉండే నీటిలో కూడా పెరుగుతాయన్నారు. ఈ మడ అడవులు ఎన్నో జీవరాశులకు జీవనాధారమన్నారు. ఇవి సముద్ర తీర ప్రాంతాలకు రక్షణ కవచంగా ఈ మడ అడవులు పటిష్టంగా నిలుస్తున్నాయన్నారు . ఈ మడ అడవులు సునామీల వంటి ఉద్ధృతమైన సముద్రపు కెరటాల నుంచి, తుఫాను నుండి ఆ ప్రాంతన్ని నేల కోతకు గురికాకుండా కాపాడతాయన్నారు.
అనంతరం ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ఎస్. శరవణన్ మాట్లాడుతూ, మన పర్యావరణాన్ని వాతావరణ మార్పుల నుండి కాపాడేందుకు ప్రపంచాన్ని చైతన్యవంతం చేసేందుకు ఉద్దేశించిందే మిషన్ లైఫ్ అంటే పర్యావరణ రహిత జీవనశైలి అని అన్నారు. గత నెల రోజులుగా లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాజమండ్రి పరిధిలో 3,700 కార్యక్రమాలు జరిపినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన పర్యావరణహిత జీవన శైలి 7 నేపధ్యములను ఆయన వివరించారు. శక్తి వనరులను పొదుపుగా వాడాలని, అదేవిధంగా
నీటిని పొదుపుగా ఉపయోగించాలని,ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వద్దు ఎలక్ట్రానిక్ వ్యర్థములను తగ్గించండని సూచించారు. అలాగే,సుస్థిరమైన ఆహార పద్ధతులను అలవర్చుకోవాలన్నారు వ్యర్ధములను తగ్గించాలని, ఆరోగ్యకరమైన జీవన శైలులను అలవర్చుకోండని కోరారు.
తర్వాత, బిగ్ స్క్రీన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యావరణానికి సంబంధించిన ప్రసంగాన్ని సభికులకు చూపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తన స్వహస్తాలతో మడ చెట్లను నిర్దేశించబడిన స్థలంలో నాటారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం తాహిసిల్దార్ సునీల్ బాబు, ఆర్ ఐ యాకూబ్, పట్టాభి రెడ్ క్రాస్ సభ్యులు, కృష్ణా యూనివర్సిటీ విద్యార్థినీ విద్యార్థులు, గిలకలదిండి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్జన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *