Breaking News

స్వ‌యంకృషికి అరుదైన పుర‌స్కారం…

-మానికొండ నాగ‌భాస్క‌ర‌రావుకు ఎన్టీఆర్ లెజండ‌రీ నేష‌న‌ల్ అవార్డు-2023

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మే 28న ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని జాతీయ స్థాయిలో 10 రాష్ట్రాల నుండి 101 మంది ప్ర‌ముఖుల‌కు ఎన్టీఆర్ లెజండ‌రీ నేష‌న‌ల్ అవార్డుల‌ను బ‌హూక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఫోనెక్స్ గ్రీన్ వ్యాలీ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ మానికొండ నాగ‌భాస్క‌ర‌రావుకు ప్ర‌ముఖ సినీ న‌టుడు మాగంటి ముర‌ళీమోహ‌న్ చేతుల మీదుగా ఎన్టీఆర్ లెజండ‌రీ నేష‌న‌ల్ అవార్డును అందుకున్నారు. అనంత‌రం సోమ‌వారంనాడు మ‌హాత్మా గాంధీ రోడ్డులోని సిద్ధార్థ మ‌హిళా క‌ళాశాల స‌మీపంలోని త‌న కార్యాల‌యంలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, తాను ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించ‌న‌ప్ప‌టికీ స్వ‌యంకృషితో నేడు 100మందికి పైగా ఉపాధి క‌ల్పిస్తున్నాన‌ని, సామాజిక బాధ్య‌త‌గా సేవా కార్య‌క్ర‌మాల‌ను, క్రీడా స్ఫూర్తితో ఎంతోమంది క్రీడాకారుల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని తెలిపారు. ముఖ్యంగా ఈ పుర‌స్కారం ల‌భించ‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ భ‌విష్య‌త్తులో మ‌రెన్నో సేవా కార్యక్ర‌మాలు నిర్వ‌హించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. చిన్న‌త‌నం నుండి న‌టుడిగా ఎన్టీఆర్‌ను ఎంత‌గానో అభిమానించేవాడిన‌ని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వాసి అయిన తాను ఎన్టీఆర్ లెజండ‌రీ నేష‌న‌ల్ అవార్డును అందుకోవ‌డం మ‌ధుర‌జ్ఞాప‌కంగా నిలిచిపోతుంద‌ని తెలిపారు. న్యాయ‌నిర్ణేత బ‌ద్ధంగా స్క్రీనింగ్ క‌మిటీ నియ‌యనిబంధ‌న‌ల‌కు లోబ‌డి త‌న‌ను ఎంపిక చేసిన ఫిలిం అండ్ టెలివిజ‌న్ ప్ర‌మోష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌.టి.పి.సి)కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న‌కు ల‌భించిన జ్ఞాపిక‌ను, గోల్డ్‌మెడ‌ల్‌ను పాత్రికేయుల స‌మావేశంలో ప్ర‌ద‌ర్శించారు. భ‌విష్య‌త్తులో త‌న వ్య‌క్తిగ‌తంగా, సంస్థ ప‌రంగా సేవా కార్యక్ర‌మాల దృక్ప‌ధంతో ముందుకు సాగుతాన‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *