విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ ఒక్కరూ వారికి ఉన్న దాంట్లోనే సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా యువత సేవాభావాన్ని పెంపొందించుకుని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయలు అన్నారు. సత్యనారాయణపురం నాగేశ్వరరావు పంతులు రోడ్డు లో ఎస్ఎస్ఎస్ కమ్యూనికేషన్ అధినేత జీ ఎస్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో గత 50 రోజులుగా మజ్జిగ పంపిణీ చేస్తూ పజ్రల దాహర్తిని తీరుస్తూ చివరి రోజున పేదలకు అన్నదానం చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆనంతరం సుమారు 600 మంది పేదలకు అన్నసంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయు కౌన్సిల్ సభ్యులు సాంబశివరావు, ఏపీయూడబ్లుజే విజయవాడ యునిట్ కార్యదర్శి, కొండా రాజేశ్వరరావు, స్సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. రమణారెడ్డి, ప్రభాకర్, కోర్నాని గాంధీ, హనుమంతు, పూర్ణ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News