Breaking News

ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్, ఉచిత డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ప్రతి ఒక్కరూ సహనం, ఓర్పు, క్షమించే గుణాలను అలవర్చుకోవాలని.. తమకు ఉన్నంతతో ఎంతో కొంత పేదలకు సాయం చేయాలని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కాటవరంలో దహించు అగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు ప్రజా సేవా కార్యక్రమాల్లో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శుక్రవారం కాటవరంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ డాక్టర్ థామస్ ఆధ్వర్యంలో పేదల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్, ఉచిత డ్రైవింగ్ స్కూల్ లను ఆమె ప్రారంభించారు. అనంతరం ద అమెరికన్ యూనివర్సిటీ యూఎస్ఏ వారిచే పొందిన ‘హ్యుమన్ ఎక్స్ లెన్స్ గోల్డెన్ ఆవార్డు’ను, సర్టిఫికేట్ ను హోంమంత్రి తానేటి వనితకు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేతులు మిన్న అన్న నానుడికి దహించు అగ్ని ట్రస్ట్ అర్థం పడుతుందన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో కుట్టు మిషన్ల పంపిణీ, వికలాంగులకు వీల్ ఛైర్స్ పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తుచేశారు. ఈ రోజు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్, మరియాసెల్వం డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దాదాపు 20 లక్షల వ్యయంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా రోజుకు 5 వేల లీటర్ల చుట్టు పక్కల గ్రామాల వారికి ఇస్తారని తెలిపారు. పేదలకు మేలు చేయాలంటే మంచి మనసు ఉండాలే తప్ప.. సేవ చేయడానికి కులం, మతం, ప్రాంతం ఏమీ అడ్డురావని తెలిపారు. పేదలకు అండగా నిలబడాలని, వారికి సేవ చేయాలనే మంచి ఉద్ధేశ్యంతో ముందుకు వెళ్తున్న ట్రస్ట్ వ్యవస్థాపకులు థామస్ కు అభినందనలు తెలిపారు. అమెరికన్ యూనివర్సిటీ యూఎస్ఏ వారిచే ‘హ్యుమన్ ఎక్స్ లెన్స్ గోల్డెన్ ఆవార్డు’ రావడం గర్వకారణమన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *