175 మంది ఎమ్మెల్యే లకి ప్రజల సమస్యలపై నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ ప్రత్యేక లేఖ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యం ప్రజా సమస్యలపై, ప్రజాస్వామ్య రక్షణ కోసం, మహిళలకు మహాత్మా గాంధీ కోరిన అర్ధరాత్రి స్వాతంత్ర్యం కోసం నిరంతరం అహింసా మార్గంలో పోరాటం చేస్తున్న నేటి గాంధీ ఆర్ ఆర్ నాగరాజన్ గాంధీ నేడు తన 53 వ పుట్టినరోజు సందర్భంగా 175 మంది ఎమ్మెల్యేలకు పత్రికా ముఖంగా లేఖను సంధించారు. ప్రజాస్వామ్య రక్షణ కొరకు నేటి గాంధీ వివిధ రూపాలలో చేసిన పోరాటంలో ఆయన వ్యక్త పరిచిన ఆవేదన పాలకులు ఆలోచించాలని కోరుతున్నారు. స్త్రీ రక్షణ లేని స్వాతంత్య్రం. స్వాతంత్య్రం కానే కాదు. అందుకు ముఖ్యముగా మద్యపాన నిషేదం కోరుతూ నేటి పరిపాలన యంత్రాంగమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కి మొత్తం 175 మంది ఎమ్మెల్యేలతో సహా అందరికి రాసిన లేఖ సారాంశం ఇలా ఉంది. “మద్యపాన నిషేధం అదే స్త్రీలకి రక్షణ కవచం అని అన్నారు. అందుకు “అహింస పాలన కోరుతూ “ఓటు మనం వేద్దాం = అది మంచి వ్యక్తికే వేద్దాం” అనే నినాదంతో రాజకీయ నాయకులు తొలి అడుగులు వేయాలని నేటి గాంధీ తనలేఖలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి, సభాపతికి, ఉప సభాపతికి, ప్రతిపక్షనాయకుడుకి, అన్ని శాఖల మంత్రిలకి, శాసన సభ్యులకి, సభ్యులందరికీ, గాంధీ నాగరాజన్ అయిన నేను ప్రజాస్వామ్య పరిరక్షణకై, స్త్రీ రక్షణ లేని స్వాతంత్య్రం, స్వాతంత్య్రం కానే కాదు. కావున ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుతూ, నా హృదయ పూర్వక . నమష్కారంతో కోరుకున్నది ఏమనగా? “మధ్యం పాలన మనకు వద్దు అది లేని పాలనే మనకు ముద్దు మద్యం, గంజా, అబిన్ అలాంటి మత్తు పదార్ధములు వలన స్త్రీకి, రక్షణ మాత్రం కాదు. భావితరాల భవిష్యత్తు శూన్యం. కావున మత్తు పదార్థముల నిషేధం కోరుతూ దేశానికి, రాష్ట్రానికి, మంచిరోజులు రావాలని ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలనే ధ్యేయంతో పాలకులు మంచి పాలన అందించాలని నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ ఓ ప్రకటనలో కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *