Breaking News

సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం..

-వేడుకలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కాంట్రాక్టు ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తూ క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రుణం తీర్చుకుంటామ‌ని ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు కొవ్వూరు నియోజకవర్గంలో హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొవ్వూరు డివిజన్ లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి (మెడికల్ అండ్ హెల్త్) ఉద్యోగులు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితను కలిసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేస్తూ పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ… గత 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమని రెగ్యుల‌రైజ్ చేయడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ముఖ్యమంత్రి తమకు న్యాయం చేశారని తెలిపారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు. అవసరం వచ్చినప్పుడు మేం కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.వి.వి. సత్యనారాయణ, ఎం. దుర్గాప్రసాద్, డి. ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *