ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో సోమవారం (12.06.2023) ఉదయం 10: 30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, మండల, గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలోనూ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ అర్జీలను గ్రామ /వార్డు సచివాలయం, మండల, డివిజన్ స్థాయిలోనూ సమర్పించ వచ్చునని కలెక్టర్ డిల్లీ రావు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *