-ముఖ్య అతిథిగా హాజరైన బావన రత్నకుమారి
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా గ్రంధాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 35 రోజుల వేసవి శిక్షణ కార్యక్రమంను బాల బాలికలు సద్వినియోగం చేసుకోవటం జరిగిందనీ కొవ్వూరు మునిసిపాలిటీ చైర్ పర్సన్ బావన రత్న కుమారి పేర్కొన్నారు.
ఆదివారం కొవ్వూరు శాఖా గ్రంధాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరముల ముగింపు దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా చైర్ పర్సన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బావన రత్న కుమారి మాట్లాడుతూ, బాల బాలిక లందరూ వేసవి శలవులను ఆనందంగా, ఆహ్లాదకరముగా వినియోగించుకోవడానికి , విజ్ఞానం పెంచుకోవడానికి వేసవి విఙ్ఞాన శిబిరాలు ఒక చక్కటి వేదిక అన్నారు. జగనన్న ప్రభుత్వం పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతోందని అన్నారు. 35 రోజులు పాటు జరిగిన ఈ వేసవి శిక్షణా శిబిరములో అనుభవజ్ఞు లైన అధ్యపకులు ద్వారా నేర్చుకొన్న కధలు చెప్పడం, పుస్తకాలు చదవడం, యోగ, సంగీతం, కూచిపూడి నాట్యం, చిత్ర లేఖనం, క్రాఫ్ట్ మొదలగు వాటి వల్ల విజ్ఞానం పెరుగుతుందనీ అన్నారు. స్కూల్స్ తెరిచిన తరువాత మరచి పోకుండా ఇష్టమైన అంశాలలో తరగతులతో పాటు తీరిక సమయాలలో నేర్చుకోవడం కొనసాగించాలని తెలియజేసారు. అలాగే గ్రంథాలయం అనేది పుస్తక భాండాగారం అని శెలవు దినాలలోగాని లేదా తీరిక సమయాలలోగాని గ్రంధాలాయానికి వచ్చి అక్కడ ఉన్న మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని అన్నారు. తద్వారా పోటీ పరీక్షలలో మెరుగైన ర్యాంకు సాధించగలుతారని అన్నారు.
పౌర గ్రంథాలయ శాఖ, పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్వంలో కొవ్వూరు ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం లో వేసవి ది.08-05-2023 నుండి 35 రోజులు పాటు నిర్వహించిన ప్రథమ శ్రేణి శాఖా గ్రంధలయధికారి జి.వి.వి.ఎన్..త్రినాథ్ రావు తెలిపారు. ఈ వేసవి శిక్షణా శిబిరములో నిర్వహించిన వత్రుక్త్వము, చిత్రలేఖనం, కధలు చెప్పడం, క్రాఫ్ట్, తెలుగు పద్యాలు, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికీ బహుమతులు అందజేయడం జరిగింది.
కార్యక్రమములో సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవర్థనం శ్రీనివాసమూర్తి, వాసవి క్లబ్ అద్యక్షులు టి.రవికుమార్, పాలకొడేటి సత్యనారయణ మూర్తి రిసోర్స్ పర్సన్స్ టి.రాధా లక్ష్మి, సిహెచ్.వెంకటరాజు , ఎం. రమాదేవి, ఎం.ఎస్.డి. శ్రీనివాస్, ఎం.దుర్గా భవాని, కె.వల్లి, ఎం.కనకదుర్గ, ఎస్.రాఘవేంద్ర రావు, గ్రంధాలయ సిబ్బంది, పి.వెంకట్, కె.ప్రశాంత్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News