రోడ్ల విస్తరణ పనులు వేగంగా చేపట్టాలి..t…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్ల విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. బుధవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో పట్టణ ప్రణాలిక, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణ పనులు ఎక్కువ కాలం సాగితే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారని, ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రదానంగా ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనుల పురోగతి పై అసహనం వ్యక్తం చేసి, తక్షణం అదనపు ప్లానింగ్ కార్యదర్శులను ఏర్పాటు చేసుకొని పనులను వేగంగా చేపట్టాలన్నారు. రానున్న వర్షాకాలం లోపు పనులు పూర్తి చేయకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవతారన్నారు. విస్తరణ జరిగిన ప్రాంతాల్లో ప్రభుత్వ నిబందనల మేరకు మంజూరు చేయాల్సిన టిడిఆర్ బాండ్లు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇవ్వలేదని, వాటిని వెంటనే ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బకాయిలు చెల్లించకుండా మీడియా సంస్థలు బోర్డ్ ల మీద యాడ్స్ పబ్లిష్ చేసుకుంటున్నారని, బకాయిల యాక్షన్ ప్లాన్ చేపట్టాలని, బకాయిలు చెల్లించని బోర్డ్ లను వెంటనే తొలగించాలని సిటి ప్లానర్ కు స్పష్టం చేశారు. బకాయిల వసూళ్లకు ప్రణాళిక అధికారులకు రోజువారి లక్ష్యాన్ని కేటాయించాలన్నారు. భవన నిర్మాణ వ్యర్ధాలను నిర్మాణదారులు ఇష్టానుసారం రోడ్ల మీద వేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి వారి నుండి అపరాధ రుసుం వసూళ్లు చేసి, వ్యర్ధాలను తొలగించాలని సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులను ఆదేశించారు. రీ సర్వే వేగవంతం చేయాలని, కోర్ట్ కేసుల్లో కౌంటర్లు, అఫిడవిట్లు పక్కాగా నమోదు చేయాలని, కంటేమ్ట్ కాకుండా ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలని, కోర్ట్ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కేసుల వారిగా ప్రతి వారం సిటి ప్లానర్ సమీక్ష చేయాలని ఆదేశించారు.
సమావేశంలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఏసిపిలు బాబురావు, అజయ్ కుమార్, డిఈఈ రమేష్ బాబు, టిపిఎస్ లు, ఏఈ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *