యోగ శక్తితో సయాటికా విముక్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యోగా ఉత్సవాలలో భాగంగా, కానూరు అశోక్ నగర్ ,”ఇండియన్ ఓం” కార్యాలయంలో యోగాశక్తి సాధన సమితి ఆధ్వర్యంలో, సయాటికా వ్యాధిపై అవగాహన సదస్సు, మరియు చికిత్సలో పాల్గొన్న డాక్టర్ మాకాల సత్యనారాయణ ప్రసంగిస్తూ, యోగాశక్తి చికిత్సలో సయాటికకు పూర్తి విముక్తి లభిస్తుందని అన్నారు. ఈ వ్యాధి మూత్రశయ నాడి మరియు గాల్ బ్లాడర్ నాడీలో వచ్చు, హెచ్చుతగ్గులే మూల కారణమని చెప్పారు. ఈ వ్యాధి కలిగిన వారు ప్రతిరోజు క్రమం తప్పక ప్రాణాయం చేయాలని, నాణ్యమైన ఆహారం, ఆర్గాన్ క్లాక్ ప్రకారం తీసుకోవాలని అన్నారు. జిబి 30 యూబీ 40 మరియు యుబి 60 నాడి కేంద్రాలను సమస్య ఉన్న వైపు మర్ధన చేయాలని చెప్పారు. చేతి మధ్య వేలుకు మర్దన చేస్తే పూర్తిస్థాయి ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగ తెరపిస్టులు కొండవీటి సుమతి, మా చూరి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *