Breaking News

యోగ విశిష్ట సేవలకు అవార్డ్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కానూరు అశోక్ నగర్ లోని యోగశక్తి సాధన సమితి కార్యాలయంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారిని బెస్ట్ యోగ శక్తి థెరపిస్టు, యోగరత్న,సేవారత్న అవార్డ్స్ తో సత్కరించినట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. బెస్ట్ యోగ శక్తి థెరపిస్టులుగా మాచూరి శ్రీరామమూర్తి, దంతాల శ్రీహరి, సయ్యద్ అస్రపున్మీసలకు అవార్డ్స్ అందజేశారు. యోగరత్న అవార్డ్స్ విశాఖపట్నం జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ యన్నం వెంకటేశ్వర్లు,గురువెల్లి కృష్ణ, తల్లపురెడ్డి రాద,కాకర్ల శివ గణేష్, కొండవీటి సుమతి, మేడే జాన్ మొషే, డాక్టర్ అలవాల రవి, భూడపాటి ఉదయ్ కుమార్, చెల్లమల శివ,9 మందికి అందజేసినారు. యోగ రంగంలో విశిష్ట సేవలందించిన 4గురు భూపేందర్ చౌదరి, నర్కెడిమిల్లి సూర్యనారాయణ, నారగాని ప్రసాద్ మరియు ఆర్య రాజకుమారి లకు సేవా రత్న అవార్డ్స తో సత్కరించినారు. యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణను యోగ గురువులు సత్కరించినారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *