Breaking News

వై ఎస్ ఆర్ పశు బీమా పథకం పోస్టర్, పాంప్లెట్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

వరదయ్య పాలెం, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం లో గల సిసిఎల్ ప్లాంట్ ఆవరణలో వైయస్సార్ పశు భీమా పథకము పోస్టర్, పాంప్లెట్ ను జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి గారు సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పశుపోషణ పై ఆధారపడిన పశుపోషకులకు ఆపత్కాలంలో పశు బీమా చెల్లింపు అందేలా తోడ్పాటు ను అందిస్తున్నారనీ,గ్రామీణ ప్రాంతాలలో చిన్న మరియు సన్న కారు రైతులు పశుపోషణ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ముఖ్యంగా పాడి పశువులు, గొర్రెలు మరియు మేకల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారని అటువంటి పశువులు, గొర్రెలు మరియు మేకలు ప్రమాదవశాత్తు మరణిస్తే పశుపోషకులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్సార్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఒక కుటుంబానికి ఐదు పశువుల వరకు పశు బీమా వర్తిస్తుందని, ఉత్పాదక దశలో ఒకసారి ఈనిన 2-10 సంవత్సరాల ఆవులు, 3-12 సంవత్సరాల మేలు జాతి ( సంకరజాతి/దేశీయ) పశువులకు ఒక్కింటికి రూ.30,000 మరియు నాటు పశువు ఒక్కింటికీ రూ.15,000 పశు బీమా చెల్లింపు అందుతుందన్నారు. ఒకటిన్నర సంవత్సరం పైబడిన మేలు జాతి (సంకరజాతి/దేశీయ) ఎద్దులు, దున్నలకు ఒక్కింటీకి రూ.30,000 మరియు రెండు సంవత్సరములు పైబడిన నాటు ఎద్దులు, దున్నలకు ఒక్కింటికి రూ.15,000 పశు బీమా చెల్లింపు జరుగుతుందన్నారు. ఆరు నెలలు మరియు ఆ పైన వయస్సు గల గొర్రెలు మేకలు మరియు పందులకు రూ.6000 పశు బీమా చెల్లింపు అందుతుందన్నారు.

వరదలు, తుఫానులు, పిడుగు పడి పశు చనిపోయినా, పాము కాటు, అడవి జంతువుల దాడి, అగ్ని ప్రమాదం, రోడ్డు/రైలు ప్రమాదము, పశువులు జబ్బు చేసి చనిపోవుట మొదలగు సందర్భాలలో వైయస్సార్ పశు బీమా పథకం వర్తిస్తుందని ఆ మేరకు పథకాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. పశువు యజమాని ఉద్దేశపూర్వకంగా పశువుకు హాని తలపెట్టినచో పశు బీమా వర్తించదని, ఇంతకు మునుపే ఇతర ఏజెన్సీల ద్వారా లేదా ఇతర పథకాల ద్వారా పశువుకు బీమా చేయించినట్లయితే ఈ పశు బీమా వర్తించదని, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి/జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి పరిధిలోకి వచ్చు ప్రమాదాలలో పశుభీమా వర్తించదని తెలిపారు .

ఏమైనా ఇతర వివరముల కొరకు, పరిష్కారములకై టోల్ ఫ్రీ నెంబర్ 1962 కి సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థక వర్ధక అధికారి రవికుమార్, సులూరుపేట ఆర్డిఓ చంద్రముని, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *