-మత్తు పదార్థాల, మాదక ద్రవ్యాల సరఫరా, సహకరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి: ఎస్పీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మత్తు పదార్థాల నివారణ దిశగా యువతకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కే.వెంకటరమణా రెడ్డి తెలిపారు. సోమవారం తిరుపతి స్థానిక ఎస్ పి కార్యాలయం నుండి ఎస్.వి యునివర్సిటీ ఆడిటోరియం వరకు అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ర్యాలీని జిల్లా ఎస్.పి పరమేశ్వర్ రెడ్డితో కలసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ … జిల్లా వ్యాప్తంగా పాటశాలలు మరియు కళాశాలలో మత్తు పదార్థాల నివారణ దిశగా ఎస్.పి అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో లేనంత యువత మన దేశంలో ఉందని అలాంటి యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి వారికున్న శక్తి నిర్వీర్యం అయి భారతదేశం ముందుకు వెళ్ళే పరిస్థితి లేకుండా పోతోందని తెలిపారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించడం, మానవ అక్రమ రవాణా ఎక్కడ జరుగుతుందో వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొలిసు శాఖ వారికి తెలియజేస్తే అలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడవచ్చునని తెలిపారు.
జిల్లా ఎస్ పి మాట్లాడుతూ… ముఖ్యంగా తిరుపతి లో యువతకు మత్తు పదార్థాలను వాడటం వలన కలిగే దుష్ప్రభావాలు, వీటి వలన వారి జీవితాలే కాకుండా వారి పై ఆధారపడిన కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి అనేది యువతకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. యువత, కూలీలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. వీటి నివారణ దిశగా పోలిస్ శాఖ తరుపున మాదక ద్రవ్యాల సరఫరా అన్ని మార్గాలను కూడా మూసివేయడం జరిగిందని తెలిపారు. అన్ని పాటశాలలు, కళాశాలలలో ఉపాద్యాయులు పిల్లల ప్రవర్తనలోని మార్పులను గమనించి వారిని మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉండేలా చూడాల్సిన బాద్యత వారిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, యువత, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News