తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల నడక మార్గంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి వై. మధుసూదన రెడ్డి వెల్లడించారు. సోమవారం తిరుపతి లో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చిరుత దాడి లో బాలుడు సురక్షితం గా బయటపడటం ఆ భగవంతుని కృప గా ఆయన అభప్రాయపడ్డారు. చిరుతను ఇరవై నాలుగు గంటలు వ్యవధిలోనే బందించ గలిగామని అదే ప్రాంతంలో తల్లి చిరుత పులి ఉందనే విషయం అపోహ మాత్రమే అని, అయినా కెమెరా ట్రాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. గతంలో పోలిస్తే అడవి దట్టంగా పెరిగిన కారణంగా నడకదారిలో వన్యప్రాణుల సంచారం ఉంటుందని అందువలన రాత్రి సమయాలలో భక్తులు గుంపులుగా వెళ్ళాలని ఆయన సూచించారు. అటవీ చట్టాల ప్రకారం ఫెన్సింగ్ వేయడం కుదరదని టీ టీ డీ వారితో సమన్వయం చేసుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. భక్తులకు వన్య ప్రాణులకు ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉండకూడదు అని ఆయన అభిప్రాయ పడ్డారు. టెక్నికల్ గా స్టడీ చేస్తున్నామని టీ టీ డీ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. తల్లి చిరుత కోసం ఆపరేషన్ కంటిన్యూ అవుతుందని, నడక మార్గంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు నిరంతరము చర్యలు తీసుకుంటూనే ఉంటామన్నారు. అదే విధంగా ఏనుగుల సంచారం విషయంలో కూడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా పొరుగు రాష్ట్రాల తో కలిసి సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు…… ఎర్రచదనం అమ్మకాలు చేపడతాం…. ఎర్రచందనం గత ఫిబ్రవరిలో 372 టన్నులను అమ్మగా 272 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని రెండవ సేల్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా వచ్చిందని తెలిపారు. టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది సమన్వయం తో కలిసి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో తిరుపతి సర్కిల్ చీఫ్ కంజర్వేటర్ నాగేశ్వరరావు, తిరుపతి డీ ఎఫ్ వో సతీష్ రెడ్డి తదిరులు పాల్గొన్నారు..
Prajavartha Online Telugu News