Breaking News

కుష్టు వ్యాధి నిర్థారణ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలకు సహకరించండి.

-అంగవైకల్యం కలిగించే కుష్టు వ్యాధి పై అప్రమత్తంగా ఉండండి.
-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటి సర్వే నిర్వహించి కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి సకాలంలో చికిత్స అందించాలని, అంగవైకల్యం నివారించడంలో జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి కుష్టు వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పేర్కొన్నారు.జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జూలై 16వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే కుష్టు వ్యాధి గ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా కుష్టు వ్యాధి పై ప్రచురించిన అవగాహన పోస్టర్లను, కరపత్రాలను సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటింటా సర్వే ద్వారా లెప్రసీ కేసుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ సహకారించి శాశ్వత లోపాలు, అంగవైకల్య బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లతో ఇంటింటా నిర్వహించే సర్వేలో కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం జరుగుతుందన్నారు. తొలి దశ లోనే బహుళ ఔషధ చికిత్స అందించడం ద్వారా వ్యాధిని అరికట్టవచ్చున్నారు. కుష్టు వ్యాధి మైకో బాక్టీరియం లెప్రీ అను బాక్టీరియా వలన వస్తుందని, ఈ క్రిములు తుమ్మడం, దగ్గడం వలన గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయన్నారు. చర్మం పై స్పర్శ లేని మచ్చలు, అరిచేతులు, అరి కాళ్ళలో స్పర్శ కోల్పోవడం, చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించ లేకపోవడం వంటి లక్షణాలను కుష్టు వ్యాధిగా గుర్తించవచ్చని అన్నారు. ఇటువంటి లక్షణాలు ఉన్న యెడల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకు తీసుకువెళ్లి పరీక్ష చేయించాలన్నారు. ప్రత్యేక మెడికల్‌ విభాగం ఉన్న వైద్య ఆరోగ్య సంస్థ నగరపాలక సంస్థ పరిధిలో అన్ని వార్డులలోను సర్వే నిర్వహించి అనుమానితులను సంబంధిత ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు నిర్వహించాలన్నారు. సర్వే నిర్వహించేటప్పుడు ఎక్కువగా నమోదు అయ్యే ప్రాంతాల వారిగాను, కమ్యూనిటీ వారిగాను పరిశీలించికుని ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వ్యాధి తీవ్రతను అరికట్టవచ్చునన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో కుష్టు వ్యాధి చికిత్స ఉచితంగా లబిస్తుందనే సమాచారాన్ని ప్రజలందరికి తెలియజేయాలన్నారు. కుష్టు వ్యాధిని జిల్లాలో సమూలంగా నిర్మూలించి కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు వైద్యాధికారులను కోరారు.పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డా. పి సంతప్‌ కుమార్‌, డిఆర్‌వో కె. మోహన్‌ కుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యం సుహాసిని, జిల్లా లెప్రసీ, టిబి, ఎయిడ్స్‌ ప్రోగ్రామ్‌ అధికారి డా. ఉషారాణి, లేప్రా ఎన్‌జివో స్టేట్‌ కో`ఆర్డినేటర్‌ రాధిక, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *