– సిఎం చే వర్చువల్ ద్వారా అగ్రి ల్యాబ్స్ ప్రారంభం
-పాల్గొననున్న హోం మంత్రి, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ తదితరులు
-ఐ. పంగిడి జెడ్పీ హై స్కూల్ లో జిల్లా స్థాయి కార్యక్రమం
-సిఎం చే వర్చువల్ ద్వారా జిల్లాకు చెందిన మూడు పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు ప్రారంభం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలో 08.07.2023న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా 2022 ఖరీఫ్ సమయంలో Dr.YSR ఉచిత పంటల బీమా పథకం సొమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా లబ్దిదార రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు రెండు పంటలకు నోటిఫై చేయబడిన వరి – దిగుబడి ఆధారంగా , అరటి – వాతావరణ ఆధారిత నమోదు కోసం రైతులపై భారం పడకుండా, రైతుల తరపున ప్రీమియం వాటాను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముఖ్యమంత్రి చే వర్చువల్ ద్వారా జిల్లాకు చెందిన రాజమహేంద్రవరం, కొవ్వూరు , గోపాలపురం మూడు పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు ప్రారంభం చెయ్యడం జరుగుతుందని అన్నారు. ఇ క్రాప్ బుకింగ్ ద్వారా నమోదు చేసుకున్న రైతులందరూ ఈ పథకం కిందకు వస్తారని కలెక్టర్ తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా అందుకున్న పంట బీమా ప్రయోజనాల వివరాలు: 2019-20 – రైతుల సంఖ్య : 541 మొత్తం: 8 లక్షలు 2020-21- రైతుల సంఖ్య : 36705 మొత్తం: 42.81 కోట్లు 2021-22- రైతుల సంఖ్య : 30267 మొత్తం: 59.49 కోట్లు అందించడం జరిగిందన్నారు. నేడు జరిగే కార్యక్రమంలో గత ఖరీఫ్-2022 లకు చెంది 15087 మంది రైతులకు మొత్తం: రూ .11.17 కోట్లు జమచెయ్యనున్నట్లు తెలిపారు. కొవ్వూరు మండలం ఐ. పంగిడి గ్రామం లో జెడ్పీ హై స్కూల్ లో జిల్లా స్థాయి కార్యక్రమం లో హోం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్న ట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తెలిపారు.
Prajavartha Online Telugu News