-“సంపూర్ణ ఆహారం – మెరుగైన జీవనం” అంశంపై శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రిజిస్ట్రార్ , ప్రొఫెసర్ ఎన్.రజని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“డిప్లొమా ఇన్ జర్నలిజం” కోర్సు విద్యార్థులతో పాటు, రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యం లో ప్రతి శనివారం నిర్వహిస్తోన్న “ఆన్ లైన్ అవగాహనా తరగతుల్లో” భాగంగా రేపు శనివారం (08-07-23) న “జర్నలిజం – కాలానుగుణ మార్పుల ఆవశ్యకత” అనే అంశం పై ఆంగ్ల దినపత్రిక ది హిందూ, రెసిడెంట్ ఎడిటర్ అప్పాజీ రెడ్డెం శనివారం ఉదయం 8నుంచి 9 గంటల వరకు ప్రత్యేక ప్రసంగం చేస్తారని ఆ సంస్థ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. “సంపూర్ణ ఆహారం – మెరుగైన జీవనం” అంశం పై శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రిజిస్ట్రార్ , ప్రొఫెసర్ ఎన్.రజని అదే రోజు(08-07-23) ఉదయం 9నుంచి 10గంటల వరకు “ ప్రత్యేక ప్రసంగం ఇస్తారని, జర్నలిజం” కోర్సు విద్యార్థులు, వర్కింగ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ గా తాము అధ్యక్షత వహిస్తామని, మీడీయా అకాడమి కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర తిలక్, కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్.వి.కె. రెడ్డి పరిచయ కర్తగా, మీడియా అకాడమీ కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు సమన్వయ కర్తగా వ్యవహరిస్తారని చైర్మన్ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News