Breaking News

అర్హులైన రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ లబ్ది..

-జిల్లాలో 9,929 మంది సాగుదారుల (కౌలుదారులు) కుటుంబాలకు మొదటి విడత రూ.7కోట్ల 44 లక్షల 67 వేల 500లబ్ధి..
-65 మంది రైతులకు రూ 3 లక్షల 32 వేల 550 పెట్టుబడి రాయితీ ఖాతాలలో జమ..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు వ్యవసాయ భూమి లేని ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఐదో ఏడాది మొదటి విడత లో 9,929 మంది రైతులకు రూ.7 కోట్ల 44 లక్షల 67 వేల 500 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఇన్‌పుట్‌ సబ్బిడీ రైతుల ఖాతాలలో జమ చేసే కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించారు.
నగరంలోని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, వివిధ కార్ఫోరేషన్‌ చైర్మన్‌లు, అధికారులతో విక్షించిన అనంతరం జిల్లాకు చెందిన రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా, పెట్టుబడి రాయతీ చెక్కులను అందజేశారు.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 2019 అక్టోబర్‌ 15 నుండి ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్‌ రైతు భరోసా ` పియం కిసాన్‌ పథఖం అమలు చేయడం జరుగుతుందన్నారు. పంట సాగు చేసే ప్రతి రైతు కుటుంబానికి 13,500 రూపాయలు మూడు విడతలగా ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు హామి ఇవ్వడం జరిగిందన్నారు.
ఐదో ఏడాది మొదటి విడతలో 9,929 మంది కౌలు రైతులకు రూ.7 కోట్ల 44లక్షల 67 వేల 500 ఆర్థిక సహాయంతో పాటు జూలై ఆగస్టు నెలలో కురిసిన అధిక వర్షాలలో పంట నష్టపోయిన 65 మంది రైతులకు రూ 3 లక్షల 32 వేల 550 పెట్టుబడి రాయితీ ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. రైతులకు ఆర్థిక చేయూత అందించాలనే దృడ సంకల్పంతో అనేక కష్టనష్టాలను అధిగమించి పంట సాగుకు అవసరమైన ఆర్థిక సహయాన్ని వరుసగా ఐదో ఏడాది కూడా ఇవ్వాలని నిర్ణయించి సొంత వ్యవసాయ భూమి కలిగిన, అటవీ భూములు సాగుచేయుచున్న రైతు కుటుంబాలకు జూన్‌ నెలలోనే విడుదల చేయడం జరిగిందన్నారు. సొంత వ్యవసాయ భూమి లేని ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులకు ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో వైఎస్సార్‌ రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరిగేదన్నారు. వీరికి కూడా సకాలంలో లబ్ది చేకూర్చాలని పంట సాగు హక్కు పత్రాల (సిసిఆర్‌సి )ను త్వరితగతిన మంజూరు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు నిధులను విడుదల చేసి ఖాతాలలో జమ చేశారన్నారు. ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే పరిహారం అందిస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామి మేరకు జూలై ఆగస్టు నెలలలో కురిసిన భారి వర్షాలకు జిల్లాలోని వివిధ మండలాలలో నువ్వులు, పెసర, మినుము పంటలు నష్టపోయిన 65 మంది రైతులకు రూ 3 లక్షల 32 వేల 550 పెట్టుబడి రాయితీని ఖాతాలలో జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ అవుతూ శ్రీ శైలజారెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు టి. శ్రీకాంత్‌, మనోజ్‌కోఠారి, జమలపూర్ణమ్మ, గీతాంజలిదేవి, లిడ్‌ క్యాప్‌ డైరెక్టర్‌ రaన్సీరాణి, మహిళా ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ విజితా సంపత్‌, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌ నాగమణెమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె. బాలాజీ కుమార్‌, జిల్లాకు చెందిన వ్యవసాయ అధికారులు యం. రత్నశ్రీ, యం. సప్న, యు. ఊర్మిళ, ఏవివి అనిత బాను, రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *