మహిళల తలరాతను మార్చేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే ఆ దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో వైఎస్సార్ ఆసరా పెండింగ్ లబ్ధిదారులకు నగదు జమ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు  శైలజా రెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అక్కచెల్లెమ్మలు చేసిన జై జగన్ జైజై జగన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. మహిళలందరూ గర్వపడేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబులా తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ఆడపడుచులందరూ వారి కాళ్లపై నిలబడి వ్యాపారవేత్తలుగా రాణించేలా చేయూతనందిస్తున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33,940 మంది పొదుపు సంఘాల మహిళలకు మూడో విడత ఆసరా ద్వారా 29 కోట్ల 52 లక్షల 91 వేల 581 రూపాయల లబ్ధి చేకూర్చినట్లు మల్లాది విష్ణు తెలిపారు. తొలి విడత ఆసరా ద్వారా 3,252 గ్రూపులకు గానూ 28 కోట్ల 38 లక్షల 58 వేల 530 రూపాయలు విడుదల చేయగా.. రెండో విడత ద్వారా 3,430 పొదుపు సంఘాల ఖాతాలలో 29 కోట్ల 65 లక్షల 32 వేల 506 రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. అలాగే 55 స్వయం సహాయక సంఘాలకు పెండింగ్ లో ఉన్న రూ. కోటి 7 లక్షల 46 వేల 207 నగదును విడుదల చేయడం సంతోషదాయకమన్నారు. మొత్తంగా మూడు విడతలలో 88 కోట్ల 64 లక్షల 28 వేల 825 రూపాయలు అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు.

నాలుగేళ్లలో అక్షరాల రూ.339 కోట్ల సంక్షేమం
మహిళా సంక్షేమం కోసం మన రాష్ట్రంలో అమలు చేస్తునన్ని పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 33,940 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 88 కోట్ల 64 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 42,760 మందికి రూ. 17 కోట్ల 26 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 10,875 మందికి రూ. 43 కోట్ల 38 లక్షలు., అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లులకు రూ. 118 కోట్ల 98 లక్షలు., వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 2,583 మందికి రూ. 12 కోట్లు., ఈబీసీ నేస్తం ద్వారా 2,593 మందికి రూ. 6 కోట్ల 81 లక్షలు నేరుగా ఆడపడుచుల ఖాతాలలో జమ చేసినట్లు వివరించారు. మొత్తంగా నాలుగేళ్లలో 1,37,244 మంది లబ్ధిదారులకు రూ. 339.32 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. మహిళలకు ఆర్థిక చేయూతనందించడం ద్వారా కేవలం నాలుగేళ్ల కాలంలోనే పేదరికంపై ఈ ప్రభుత్వం విజయం సాధించిందని మల్లాది విష్ణు అన్నారు. 2016 డిసెంబర్ నాటికి ఏపీలో 11.77 శాతం మంది ప్రజలు నిరుపేదలుండగా.. 2021 డిసెంబర్ నాటికి 6.06 శాతానికి తగ్గినట్లు తెలిపారు. జనాభాలో 10 శాతం లోపే పేదలు ఉండాలన్న లక్ష్యాన్ని నవరత్నాల పథకాల రూపంలో ఈ ప్రభుత్వం సాధించిందని వెల్లడించారు. ఆసరా నాలుగో విడత సాయం అందే నాటికి నియోజకవర్గంలోని ప్రతిఒక్క మహిళ వ్యాపారరంగంలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పీఓ యూసిడి శకుంతల, సీడీఓ జగదీశ్వరి, వైసీపీ కార్పొరేటర్లు ఎండి షాహినా సుల్తానా, ఇసరపు దేవీ రాజారమేష్, ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, కుక్కల అనిత రమేష్, పెనుమత్స శిరీష సత్యం, ఉద్ధంటి సునీత సురేష్, నాయకులు ఆత్మకూరు సుబ్బారావు, గుండె సుందర్ పాల్, అలంపూర్ విజయ్, హఫీజుల్లా, వెన్నం రత్నారావు, మేడేపల్లి ఝాన్సీ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *