విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్ ఢిల్లీ రావు ఇంచార్జ్ డిఆర్ఓ వెంకటేశ్వర్లు తో కలసి స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫారం 6,7,8 కు సంబంధించి నమోదైన దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరిస్తున్నామన్నారు ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ 15 నుండి జిల్లాలో ఫారం 6 లో 63,330 దరఖాస్తులు రాగా వీటిలో 56,109 పరిష్కరించామని ఇంకను మిగిలి ఉన్న 3,563 త్వరితగతిన పరిష్కరిస్తున్నామని అన్నారు. ఫారం 7లో నమోదైన 61, 818 దరఖాస్తులకు గాను 46,658 పరిష్కరించామని ఇంకను మిగిలి ఉన్న 12,000 దరఖాస్తులను పరిష్కరించవలసి ఉన్నదన్నారు. మొత్తంగా లక్ష 17 వేల 101దరఖాస్తులకు గాను 1,11,660 దరఖాస్తులను పరిష్కరించామని ఇంకనూ మిగిలి ఉన్న 3,448 దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు. ఈ నెల 22 న తదుపరి రాజకీయ పార్టీల ప్రతినిధులతో తో సమావేశం నిర్వహించి తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించడం జరుగుతుందని కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు.ఈ సమావేశం వైయస్సార్ సిపి నుంచి ఎం ఆంజనేయ రెడ్డి ,టిడిపి పార్టీ నుండి ఎల్ శివరాం ప్రసాద్,సిపిఎం పార్టీ నుంచి డివి కృష్ణ బాబు,కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్, డిటి రాజేశ్వరి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News