రైతు ఉత్పత్తి సంఘాలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమము…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, రాజమండ్రి, జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ఆధ్వర్యంలో, జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (NAARM, Hyderabad) ద్వారా రైతు ఉత్పత్తి సంఘాలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమము సి.టీ.ర్.ఐ, రాజమండ్రి ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డి.డి.యం డాక్టర్. వై. యస్. నాయుడు పాల్గొని, భవిష్యత్తులో రైతు ఉత్పత్తి సంఘాలు స్వయం సమృద్ధి కోసం దశా నిర్దేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో సి.టీ.ర్.ఐ, డైరెక్టర్ డా ఎమ్.శేషు మాధవ్, తన ప్రసంగంలో సంస్థ పరివర్తన గురించి ప్రస్తావించారు. పొగాకుతో పాటు, పసుపు, మిర్చి, అశ్వగంధ మరియు ఆముదంపై కూడా పరిశోధనలు జరపబడతాయని వివరించారు . విలువ జోడింపు మరియు సహకార సంస్థలతో అనుసంధానం ద్వారా వాణిజ్య వ్యవసాయంపై దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమాన్ని నార్మ్ సంస్థ శాస్త్రవేత్త డా. సత్యేంద్ర, డా. దివాకర్ లు నిర్వహించారు . ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐకార్- సిటిఆర్ఐ డా. హెచ్. రవిశంకర్, కెవికె, కలవచర్ల హెడ్ డాక్టర్ వి.ఎస్.జి.ఆర్. నాయుడు, సైంటిస్ట్ డా. బి. హేమ, రైతు సంఘాలు నడిపించే స్వచ్చంద సేవా సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *