ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలన్నదే ప్రభుత్వ ప్రదాన లక్ష్యం

-ప్రజా ఆరోగ్య భద్రతకు జగనన్న ఆరోగ్య సురక్ష.
-ఇంటి ముందుకే వైద్యం అందిస్తున్న ప్రభుత్వం
-రిఫెరల్ కేసుల విషయంలో ఆరోగ్య మిత్రాలు సహకారం అందిస్తారు
-ఈరోజు జేఏసీలో చేసిన పరీక్షలు 526 కేసులు .. రిఫర్ చేసినవి 31
-జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత

కోరుకొండమండలం (దోసకాయలపల్లి),  నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి ప్రతి ఒక్కరికీ సమగ్ర వైద్య సేవలను అందిస్తుందని, ప్రతి ఒక్కరు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పేర్కొన్నారు.

సోమవారం కోరుకొండ మండలం దోసకాయలపల్లి సచివాలయం-1 ప్రాధమిక ఆసుపత్రి పరిధిలోగల యంపీపీ పాఠశాలలో నిర్వహించిన ” జగనన్న ఆరోగ్య సురక్ష ” శిబిరాన్ని కలెక్టర్ మాధవీలత, వైద్య శాఖ అధికారులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించి డేటా సేకరించి, గ్రామ స్థాయిలోని ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు ఆధ్వర్యంలో పరిక్షలు నిర్వహిస్తున్నా మన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి పేదవానికి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత నిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు సచిలయ సిబ్బంది అందరూ కూడా గత 15 రోజుల నుండి ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని అక్కడే వారి ఇంటి వద్దనే 7 రకాల వైద్య పరీక్షలు బ్లడ్ ప్రెషర్, షుగర్ లను పరీక్షించి అక్కడే వారికి టోకెన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈరోజు దోసకాయలపల్లి – 1లో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. గత 15 రోజులు నుండి సర్వే చేసి తిరిగిన ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య పరీక్షలు చేయడం జరిగిందని అన్నారు. మహిళలకు సంబంధించి గైనకాలజిస్టులు, ఆర్థోపెడిక్ డాక్టర్లు, చిన్నపిల్లల నిపుణులు, కంటి వైద్య నిపుణులు ఉన్నారన్నారు. ఈ శిబిరంలో వారి వారికి సంబంధించిన 11 రకాల పరీక్షలను కూడా వారికి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అవసరాన్ని బట్టి వారికి అన్ని పరీక్షలు ఇక్కడే నిర్వహించి వారికి తగు వైద్యం అందిస్తూ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈరోజు ఈ వైద్య శిబిరం ద్వారానే కాకుండా రాబోవు రోజుల్లో రిఫారల్ కేసులకు చెందిన కూడా వారందరిని చెయ్యి పట్టి నడిపించాలన్నదే జగనన్న ఆరోగ్య సురక్ష ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమం ఎంతో బృహత్తరమైన కార్యక్రమమని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సంపూర్ణ ఆరోగ్యం అన్నారు. నేడు మీ ప్రాంతంలోనే ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్ శిబిరానికి నేరుగా వచ్చి పరీక్షలు చేయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈరోజు శిబిరంలో మొత్తం 552 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వాటిలో తదుపరి వైద్య సేవలు కోసం 31 మందిని రిఫరల్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు సిఫార్సు చేసామని వైద్యాధికారులు వివరించారు

ఈ సందర్భంగా కలెక్టర్ వైద్య శిబిరానికి వచ్చిన వారితో ముఖాముఖి మీకు ఈ వైద్య శిబిరంలో వైద్యులు మీ ఆరోగ్య భద్రతకు సంబంధించి ఎటువంటి పరీక్షలు నిర్వహించారు. మీకు సంతృప్తికరంగా ఉందా అంటూ వైద్య సేవలు పొందుతున్న ప్రజలతో ముఖాముఖి మాట్లాడి ఆరా తీశారు. కలెక్టరు కంటి పరీక్షలు చేస్తున్న వారి వద్దనే ఉండి వారికి మందులను అందజేశారు. ప్రతి గ్రామంలో 104 ద్వారా ఇద్దరు వైద్యులతో రెండు పర్యాయాలు పర్యటించి ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటారన్నారు. ఇప్పటికే ప్యామిలీ డాక్టరు కాన్షప్టు అమలు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల ఇంటికే వచ్చి బీసీ, షుగర్, మలెరియా, డెంగ్యూ వంటి 7 రకాల వైద్య పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. ఈ పక్రియ ఆరోగ్య కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకొనే వరకు ఐదు విడతగా అమలు చేస్తున్నామన్నారు.

ఈ శిబిరంలో అనేక రకాల కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని హెల్ప్ డెస్క్, స్పాట్ కౌంటర్, వివిధ పరీక్షలు కూడా ఇక్కడే నిర్వహించడం జరుగుతుందని, ఈసీజీ, రక్త పరీక్షలు అన్ని రకాల పరీక్షలు చేయడంతో పాటు పెద్ద ఆసుపత్రులకు కూడా రెఫర్ కూడా ఇక్కడి నుండే చేయడం జరుగుతుందని అన్నారు. అందుకు సంబంధించి కూడా ఇక్కడ ఆరోగ్య మిత్ర డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ డెస్క్ ద్వారా రాబోవు రోజుల్లో కూడా వారికి ఏదైనా మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీలో చేయించేందుకు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కౌంటర్ తెలియజేస్తారని అన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె. వెంకటేశ్వరరావు,జిల్లా సర్వెయల్ అధికారి డా.రాజీవ్, డిఎన్ఎంఓ డ . లక్ష్మి, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా. ప్రియాంక ఈ వైద్య శిబిరంలో వైద్యులు, వైద్యాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *