Breaking News

మంగళవారం తూర్పు గోదావరి జిల్లా పులుగుర్త లో పర్యటించనున్న కేంద్ర బృందం

-ఒక జిల్లా ఒక ఉత్పత్తి గా పులుగుర్త చేనేత వస్త్రాల యూనిట్ ఎంపికకు కేంద్ర బృందం పరిశీలన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ) కి ప్రోత్సాహం అందించే నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా పులుగుర్త కాటన్ ఫ్యాబ్రిక్స్ ను ప్రతి పాధించడం జరిగిందని, ఈ నేపథ్యం లో క్షేత్ర స్థాయిలో మల్కా, పులుగుర్త కాటన్ ఫాబ్రిక్ యొక్క స్వంత సాంస్కృతిక ప్రాముఖ్యత, ప్రత్యేకమైన హస్తకళ మరియు మార్కెట్ సామర్థ్యాన్ని మంగళవారం కేంద్ర బృంద పరిశీలకులు ఇన్వైస్టు ఇండియా టీమ్ ప్రతినిధి హరప్రీత్ సింగ్ పరిశీలించడం జరుగుతుందని జిల్లా చేనేత మరియ జౌలి శాఖ అధికారి కె. పెద్దిరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక జిల్లా నుంచి ఒక ఉత్పత్తి ని ఎంపిక చేసి అవార్డు కొరకు ఎంపిక ప్రక్రియలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పులుగుర్త కాటన్ ఫ్యాబ్రిక్స్ అవార్డు ఎంపిక కొరకు దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు కేంద్రం బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల పర్యటనల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలోని పులుగుర్త గ్రామంలో ఉన్న పులుగుర్త చేనేత నేత సహకార సంఘం ద్వారా మల్ఖా, పులుగుర్త కాటన్ ఫాబ్రిక్ ను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా కేంద్రబృందం మంగళవారం పరిశీలంచడం జరుగుతోంది. గత 35 సంవత్సరాల నుండి, ఇది ఒక సంవత్సరం మినహా నిరంతరంగా లాభాలను ఆర్జించే సొసైటీగా గుర్తించబడి సర్టిఫికేట్ ‘A’ క్లాస్‌తో ఆడిట్ చేయబడింది. పులుగుర్త చేనేత చేనేత సహకార సంఘం సుమారు 300 మందికి చేనేత మరియు అనుబంధ కార్యకలాపాలలో ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటికే జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద పులుగుర్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.120.50 లక్షలతో క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ మంజూరు చేయడం జరిగింది. స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల వస్త్ర ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సాంప్రదాయ కళాకారులు మరియు డిజైనర్లను కలిగి ఉన్న వికేంద్రీకృత విధానానికి ఈ బృందం చేసే సిఫార్సులు మేరకు ఎంపిక చేస్తారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *