Breaking News

మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ తుది జాబితా విడుదల

-నేడు (10.10.23) సర్వీస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్
-ఏపీ మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లోని (ఏపీ మోడల్ స్కూల్) 14 మంది ప్రిన్సిపాళ్ల పోస్టుల పదోన్నతులకు సంబంధించి 50 అభ్యంతరాలు స్వీకరించామని, తర్వాత వాటిని పరిష్కరించి సీనియర్టీ తుది జాబితా, ప్యానెల్ జాబితా cse.ap.gov.in వెబ్ సైటులో పొందుపరిచినట్లు ఏపీ మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ ఎం వి కృష్ణారెడ్డి తెలిపారు. పదోన్నతుల తుది జాబితాలో ఉన్న అభ్యర్థులు సర్వీస్ రిజిస్టర్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ కు మంగళవారం (10.10.23న) ఉదయం పది గంటలకు ఏపీ మోడల్ స్కూల్ రాష్ట్ర కార్యాలయం, ఇబ్రహీంపట్నం నందు హాజరవ్వాలని ఏపీ మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ ఎం వి కృష్ణారెడ్డి  కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *