Breaking News

ఆడుదామా దాండియా

-దుర్గమ్మకు నృత్య నీరాజనం సమర్పించనున్న క్రియోటివ్ సోల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు నృత్య నీరాజ‌నం అర్పిస్తూ క్రియేటివ్ సోల్ నిర్వ‌హిస్తున్న దాండియా వర్క్ షాపు వేడుకగా సాగుతోంది. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వేన్షన్ సెంటర్ వేదికగా వర్క్ షాపు నిర్వహిస్తున్నారు. ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ పొందుతున్న క‌ళాకారులు చేసిన నృత్య రీతులు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తున్నాయి. ఆరు సంవ‌త్స‌రాల చిన్నారుల మొద‌లు, అర‌వై సంవ‌త్స‌రాల వృద్దుల వ‌ర‌కు సాంప్రదాయ వస్త్రాలకు భిన్నంగా ఆధునిక జీన్స్ తో సోమవారం ఉత్సాహంగా ప‌దం పాడుతూ క‌దం తొక్కారు. విజ‌య‌వాడ వాసుల‌కు వినూత్న అనుభూతిని మిగుల్చుతూ 2017 నుండి వేడుక సాగుతుండగా, చిన్న పెద్ద క‌లిసి చేసిన దాండియా, గ‌ర్బా నృత్య‌రీతులు అందరినీ అలరించాయి. సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను క్రియోటివ్ సోల్ ఆంధ్రప్రదేశ్ కు పరిచయం చేసింది. కళలతో దేశసమైఖ్యతను చాటేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నగర వాసులు మంచి సహకారం అందిస్తున్నారు.

దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా ప్రదర్శిస్తారు. క్రియేటివ్ సోల్ వ్య‌వ‌స్ధాప‌కులు సుమ‌న్ మీనా, నేహా జైన్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ దసరా వేడుకల సందర్భంగా ఈ సంవ‌త్స‌రం అమ్మ‌వారికి మ‌రింత ఘనంగా నృత్య నీరాజ‌నం అర్పించేందుకు తమ బృందం సిద్దం అవుతుందన్నారు. లబ్బీపేట ఎస్ ఎస్ కన్వేన్షన్ లో అక్టోబరు 15వ తేదీన జరిగే మెగా ఈవెంట్ కు ముంద‌స్తుగా ఎంట్రీపాస్‌లు తీసుకుని హాజ‌రు కావ‌చ్చ‌న్నారు. ఎంట్రీ పాస్ ల కోసం 9700346517( సూరజ్), 9908544747 (సోను పటేల్), 9440089262 (టింకు), 9966411099 (గిరీష్ చౌహాన్), 9885210832( జైన్), 9959516016 (పండు) నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. సాయంత్రం ఐదు గంటలకే కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *