రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ కమీషనర్, విజయవాడ వారు ప్రజహితార్థం జారీ చేసిన సూచనల ప్రకారం,జిల్లా నందు గల వంట గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలండర్ కొనుగోలు/ డెలివరీ సమయంలో ఈ క్రింది అంశములు తప్పక గమనించగలరని జిల్లా కలెక్టరు తరపున పౌరసరఫరాల అధికారి పి.విజయభాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ బిల్ చెల్లించేటపుడు వీలైనంత వరకు నగదురహిత విధానాన్ని అవలంభించాలని, వినియోగదారులకు సిలిండర్ సరఫరా చేయు సమయంలో ఇచ్చే రశీదులో ధర, రవాణా చార్జీలు మరియు డెలివరీ చార్జీలు కలిసే ఉంటాయన్నారు. ఎటునంచి అదనపు చార్జీలు చెల్లించవద్దని, డెలివరీ కాబడే నిండు గ్యాస్ సిలిండర్ సాధారణ బరువు 14.2 కేజీలు డెలివరీ బాయ్ వినియోగదారులకు తూకం వేసి చూపించాలన్నారు. గ్యాస్ సిలిండర్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి ఆస్థి నష్టం వాటిల్లిన యెడల రూ.2 లక్షలవరకు పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. సదరు పరిహారం గ్యాస్ కనెక్షన్ పొందు సమయంలో నమోదైన చిరునామాలో ఉన్న ఆస్థులకు మాత్రమే వర్తిస్తుందని, కావున చిరునామా మారినపుడు తప్పనిసరిగా డీలరు వద్ద చిరునామా మార్పు తప్పనిసరిగా చేయాలన్నారు. గ్యాస్ సిలిండర్ ప్రమాదం లో ఎవరైనా మరణిస్తే ఒక్కొక్కరికి రూ.6 లక్షలు బీమా పరిహారంగా చెల్లించడం జరగుతుందని, ప్రమాదంలో గాయపడిన యెడల వైద్య ఖర్చుల నిమిత్తం గరిష్టంగా ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.2 లక్షల రూపాయల చొప్పున గరిష్టంగా ఒక సంఘటనకి రూ. 30 లక్షలు అందిస్తారని పేర్కొన్నారు. తక్షణ సహాయం క్రింద ఒక్కొక్క క్షతగాత్రునికి రూ. 25 వేల రూపాలయలు అందించడం జరుగుతుందన్నారు. గ్యాస్ సిలిండర్ ధర కంటే అదనంగా డెలివరీ చార్జీలు డిమాండ్ చేస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ టోల్ ఫ్రీ నెంబరు 1800-2333555 కు లేదా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నెంబరు 1967 కు ఫిర్యాదు చేయవచ్చునని, ప్రజాహితార్ధం తూర్పుగోదావరి జిల్లా కలక్టరు వారి కార్యాలయం, రాజమహేంద్రవరం నందు వంట గ్యాస్ వినియోగదారుల ఫిర్యాదుల కొరకు ఫోన్ నెం. 8309487151 గల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
Tags rajamendri
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News