-ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని నిరు పేదలకు ఉచితంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా వంట గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా జారీకి చర్యలు చేపట్టండ జరిగిందని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉజ్వల కమిటీలో కలెక్టర్ చైర్మన్ గా జిల్లా పౌర సరఫరాల అధికారి, బీపీసీఎల్ కో- ఆర్డినేటర్, ఐ.వో.సీ.ఎల్, హెచ్.పి.సి.ఎల్ సేల్స్ ఆఫీసర్లను సభ్యులుగా ఉంటారన్నారు. దేశంలో ఈ పథకం ద్వారా 70 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు, ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లాకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చినా కమిటీ పరిశీలించి జారీ చేస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం కనెక్షన్ తీసుకున్న ప్రతినెలా కొనుగోలు చేసే సిలిండరు ధరలో రూ.300 కేంద్ర ప్రభుత్వం లబ్దిదారుడికి రాయితీ కింద బ్యాంకు ఖాతాకు జమ చేస్తుందని తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద జారీ చేసే వంట గ్యాస్ కనెక్షన్ కు ఉచితంగా సిలిండరు, స్టవ్, రెగ్యులేటర్, పైపు అందించడం జరుగుతుంది. సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి అవసరమైన పత్రాలతో దరఖాస్తు అందజేస్తే సరిపోతుందన్నారు. గ్యాస్ కనెక్షన్ పొందే లబ్దిదారునికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని, గతంలో రేషన్ కార్డులో ఉన్న సభ్యుల పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలని, బ్యాంకు ఖాతా ఉండాలని, తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని కలెక్టరు ఆ ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు చేసుకొనేందుకు అర్హతలు…
అర్హత ఉన్న వారంతా సీఎం ఉజ్వల యోజన పథకంలో క్రొత్త గ్యాస్ కనెక్షన్ కు ధరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే ఆయా గ్యాస్ ఏజెన్సీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాని, కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ఇది మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీ భరించి ఉచితంగా ఈ కనెక్షన్లు జారీ చేస్తోందని, ఆయా గ్యాస్ ఏజెన్సీలకు వచ్చిన దరఖాస్తులను జిల్లా స్థాయి ఉజ్వల కమిటీలో ఆమోదించి. కనెక్షన్లు జారీ చేయడం జరుగుతుందని, పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరు ఆ ప్రకటలో కోరారు.
Prajavartha Online Telugu News