Breaking News

ఆన్లైన్ పోర్టల్ లో సేవలు ఎంటర్ చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వార రిఫర్ చేసిన కేసులను వెంటనే రిఫరల్ సెంటర్సు పంపి క్లోజ్ చేసి ఆన్లైన్ పోర్టల్ లో ఆ సేవలు ఎంటర్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.వెంకటేశ్వరరావు ఉమెన్ ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. మంగళవారం స్థానిక ఆవ వాంబే కాలనీ అర్భన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రీ ప్రొడెక్టివ్ చైల్డ్ (ఆర్సీహెచ్) అంశంపై మహిళా ఆరోగ్య కార్యకర్తలకు అందించే శిక్షణా కార్యక్రమంలో డియంహెచ్ ఓ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వార రిఫర్ చేసిన కేసులను వెంటనే రిఫరల్ సెంటర్సు పంపి క్లోజ్ చేసి ఆన్లైన్ పోర్టల్ లో ఆ సేవలు ఎంటర్ చేయాలన్నారు. అదేవిధంగా ఆర్సీహెచ్ పోర్టల్ నందు నమోదు చేయాల్సిన లక్ష్యాలను నూరు శాతం పూర్తి చేసేవిధంగా కృషి చేయాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వంటి ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని వైద్య సింబందికి డియంహెచ్ ఓ డా. వెంకటేశ్వరరావు ఈ సందర్బంగా తెలిపారు. ఈసందర్బంగా కీ – డెలివరీబుల్స్ తక్కువుగా ఉన్న ఏఎన్ఎం లకు లక్ష్య సాధనపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఏటినేటల్ రిజిస్ట్రేషన్ ,చైల్డ్ రిజిస్ట్రేషన్ ,గర్భిణీ సేవలు , ప్రసూతి సేవలు, బాలింత సేవలు ఇమ్మునైజేషన్ టీకలను ఏవిధంగా అందించాలనే అంశాలపై శిక్షణ అందించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధాకారి సంధ్యారెడ్డి, డీపీహెచ్ఎన్.ఓ జి.వసంతలక్ష్మి, ఎంఐఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *