తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో కంటి పరీక్షలలో కేటరాక్ట్ కంటి ఆపరేషన్ కొరకు గుర్తించబడి ఎంపిక కాబడిన వారికి శస్త్ర చికిత్సలు నవంబర్ మాసం నుండి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్, NGO హాస్పిటల్స్, SVRR హాస్పిటల్, SVIMS హాస్పిటల్, అరవింద్ హాస్పిటల్ తదితర హాస్పిటల్స్ ద్వారా ఉచితంగా ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్, NGO హాస్పిటల్స్, SVRR హాస్పిటల్, SVIMS హాస్పిటల్, అరవింద్ హాస్పిటల్, సాయిసుధ హాస్పిటల్ సురేంద్ర హాస్పిటల్ తదితర ఆసుపత్రుల వారికి సూచిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు లందు కంటి పరీక్షలలో కంటి కేటరాక్ట్ ఆపరేషన్స్ కొరకు గుర్తించబడిన వారికి ఆపరేషన్స్ వచ్చే నెల నవంబర్ నుండి నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ నెల సెప్టెంబర్ 30 నుండి జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు లందు కంటి పరిక్షలలో 2350 మంది కాటరాక్ట్ ఆపరేషన్స్ కు గుర్తించబడిన వీరందరికి కూడా ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాలాలో ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. కంటి ఆపరేషన్ కొరకు గుర్తించబడిన వారిని వివరాలతో ఏఎన్ఎం వాలంటీర్లు సదరు కంటి శస్త్ర చికిత్సలకు ఎంపిక చేయబడిన వారిని తరలించేలా పక్కా ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఇందు కొరకు సంబంధిత అధికారులు డాక్టర్లతో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి రోజువారీగా సమీక్ష చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి dr U. శ్రీహరి, డీపీఎంవో Dr శ్రీనివాసరావు, జిల్లా ఆంధత్వ నివారణ అధికారి dr మధుబాబు, JAS ప్రోగ్రామ్ అధికారి dr తేజస్విని తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News