-నవంబర్ 17 శుక్రవారం మ.3 గంటలకు రాజమహేంద్రవరం హోటల్ మంజీరా లో
-సమావేశ వేదికపై విలువైన సూచనలు అందచేసే వారు ముందస్తు అనుమతి పొందాలి
-కలెక్టర్ల కు లేఖ రాయడం జరిగింది
-మీమీ జిల్లాల్లో ఆర్డీవో లకు ముందస్తుగా నవంబర్ 15 ల్లోగా దరఖాస్తులు అందచెయ్యలి
-తూ.గో. జిల్లా కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్ 17 వ తేదీ శుక్రవారం రాజమహేంద్రవరం లో నిర్వహిస్తున్న కుల గణన కు సంబందించిన ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సూచనలు సలహాలు ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న వారు నవంబర్ 15 బుధవారం లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని 5 జిల్లాలకు చెందిన మంత్రులు , ఎంపి. లు , ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యే లు, జెడ్పీ చైర్మన్ లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు , సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మేధావి వర్గం, తదితరులతో సమావేశం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈమేరకు సంబంధిత జిల్లా కలెక్టర్ లకు లేఖ రాయడం జరిగిందని, ఈనెల 15 లోగా సంబంధిత అధికారుల పాల్గొనే వక్తల వివరాలు అందించాలని కోరడం జరిగిందన్నారు.
రాజమహేంద్రవరం లోని హోటల్ మంజీరా నందు నవంబర్ 17 వ తేదీ శుక్రవారం సా 3.00 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న దృష్ట్యా తప్పక హాజరై తమ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రాంతీయ స్థాయిలో సమావేశం రాజమహేంద్రవరం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కులగణన పై సూచనలు సలహాలు ఇచ్చే వ్యక్తులు, ప్రతినిధులు ముందస్తుగా ఆయా రెవెన్యూ డివిజన్ అధికారులకు సమావేశంలో ప్రసంగించడానికి ఈనెల 15 వ తేదీ లోగా సంబంధిత ఆర్డీవో లకు ముందస్తు గా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆమేరకు ఆయా జిల్లా కలెక్టర్ల చొరవ తీసుకుని వివరాలు పంపాలని కోరామన్నారు. కుల గణన ప్రక్రియ ఫలవంతం అయ్యే విధంగా తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News