న్యాయబద్ధమైన జీవనంతోనే గౌరవం లభిస్తుంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి  రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. కారాగారంలోని సదుపాయాలను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు. వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పరివర్తన చెంది గౌరవంగా జీవించాలన్నారు. న్యాయబద్ధమైన జీవనంతోనే గౌరవం లభిస్తుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్ల పని తీరు గురించి ఆరా తీశారు. ఖైదీలు అందరికీ అందుబాటులో ఉంటూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు వారి అవసరాలను, ఫిర్యాదులను తెలియపరచాలని పారా లీగల్ వాలంటీర్లతో చెప్పారు. ఖైదీల తరపున వాదించేందుకు న్యాయవాది లేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. వారికి మరే విధమైన న్యాయ సమస్యలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకు రావాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *