Breaking News

జనతా పర్సనల్ ఆక్సిడెంట్ పాలసీ ద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ది.ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లి. హెడ్ ఆఫీస్ భవనం నందు బుధవారం తేదిన పాలకవర్గ కమిటీ చైర్ పర్సన్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మరియు కమిటీ సభ్యుల సమక్షంలో ప్రమాదంలో మరణించిన బ్యాంకు మెంబర్లు అయిన అనంతరపు వెంకట రావు, సంగం శ్రీనివాస్ లకు చెందిన నామిని లకు గ్రూప్ జనతా పర్సనల్ ఆక్సిడెంట్ పాలసీ ద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెక్కు ఒక్కొక్క సభ్యుని కుటుంబానికి రూ.1,00,000/- లు అందజేయుట జరిగినది. ఈ సందర్భంలో కోట గుమ్మం బ్రాంచి షిఫ్టుంగ్ కొరకు తీసుకున్న కొత్త ప్రదేశం నందు జరుగుతున్న పనులను కమిటీ చైర్ పర్సన్ మరియు సభ్యులు పరిశీలించుట జరిగినది. అనంతరం బ్యాంకు యొక్క ఎన్ పి ఏ మరియు ఇతర అంశములు చర్చించుట జరిగినదని తేజ్ భరత్ పేర్కొన్నారు. జేసీ వెంట ది ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు కార్యదర్శి కె. స్వరాజ్య లక్ష్మి ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *