Breaking News

ఘనంగా యూనియన్ బ్యాంక్ 105 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జోనల్ ఆఫీస్ & రీజినల్ ఆఫీస్ విజయవాడ సంయుక్తంగా విజయవాడలో 105 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాయి. శుక్రవారం విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి కస్టమర్‌లు, శ్రేయోభిలాషులు మరియు బ్యాంక్ సిబ్బంది కుటుంబాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ  వేడుకలను జనరల్ మేనేజర్ & జోనల్ హెడ్ ఎం.రవీంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. మేనేజింగ్ డైరెక్టర్ మణిమేకళై, సిబ్బందికి మరియు కస్టమర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మా బ్యాంక్ రాష్ట్రంలోని 1150+ శాఖలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల వివిధ ఆర్థిక అవసరాలను తీరుస్తోంది, మేము మా రెండు జోన్‌లు విజయవాడ మరియు విశాఖపట్నంతో ఏపీ కి సేవలందిస్తున్నామన్నారు. కోట్ల రుణాలను మంజూరు చేస్తూ కస్టమర్‌ల  ఎదుగుదల మరియు రాష్ట్రాభివృద్దికి యూనియన్ బ్యాంక్ కృషి  చేస్తోందన్నారు. వ్యవసాయం, గృహనిర్మాణం, విద్య, పరిశ్రమలు అభివృధికి రుణాలు అందచేయడంలో ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఉన్నదన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో విజయవాడ & ఎస్ ఎల్ బి సి కన్వీనర్, ఎం. శ్రీధర్, రీజనల్ హెడ్ విజయవాడ, ఏఫ్జీఎంవో చీఫ్ మేనేజర్ జయశ్యామ్, వివిధ బ్రాంచీల అధికారులు మరియు ఇతర సిబ్బంది అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *